బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీదారు Tecno, అతిపెద్ద 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో Tecno Spark Power 2 ను భారతదేశంలో విడుదల చేసింది. బడ్జెట్ వినియోగదారులకు కూడా ఒక పెద్ద బ్యాటరీ, ఎక్కువ కెమెరాలు మరియు పెద్ద ర్యామ్ తో ఈ ఫోన్నుఅందించే లక్ష్యంతో, ఈ Tecno Spark Power 2 స్మార్ట్ ఫోన్‌ను కేవలం ధర రూ .9,999 ధరకే ప్రకటించింది. ఈ టెక్నోస్పార్క్ పవర్ 2 , రెడ్మి 8 ఎ డ్యూయల్, రియల్‌మి నార్జో 10 ఎ మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో తో పోటీ పడగలదు.
Survey
✅ Thank you for completing the survey!
Tecno Spark Power 2 Price
టెక్నో స్పార్క్ పవర్ 2 ను భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోనుగా ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ధర 9,999 రూపాయలు మరియు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి అమ్మకం జూన్ 23 వ తేదీన Flipkart నుండి జరుగుతుంది. అంటే, ఈ ఫోన్ మొదటి అమ్మకం వచ్చే మంగళవారం అర్ధరాత్రి నుండి ప్రారంభమవుతుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఇంత బలమైన బ్యాటరీతో వచ్చే చౌకైన ఫోన్లలో ఇది ఒకటి. భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి పెద్ద బ్యాటరీలు వినియోగదారులకు గొప్ప ఎంపిక.
ఈ స్మార్ట్ ఫోన్ అతిపెద్ద బ్యాటిరితోపాటుగా ఒక పెద్ద 7-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది మరియు దీని రిజల్యూషన్ 1640 x 720 పిక్సెల్స్. మునుపటి ఫోన్ మాదిరిగానే, టెక్నో స్పార్క్ పవర్ 2 మీడియాటెక్ హెలియో P 22 SoC శక్తిని కలిగి ఉంది మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది మరియు SD కార్డ్ ద్వారా 256GB వరకు స్టోరేజిను విస్తరించవచ్చు.
టెక్నో స్పార్క్ పవర్ 2 లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చింది.ఇందులో ఒక 16MP ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు నాల్గవ AI లెన్స్‌తో జత చేయబడింది. ఇందులో అందించిన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం ఒకే ఛార్జ్‌లో నాలుగు రోజుల వరకు ఉంటుందని టెక్నో పేర్కొంది. ఇది 18W ఛార్జర్‌తో తీసుకురాబడుతుంది, ఇది అరగంటలో 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.