Nokia 5310 Express Music 2020 మ్యూజిక్ ప్రియులకు నోకియా కానుక

Nokia 5310 Express Music 2020 మ్యూజిక్ ప్రియులకు నోకియా కానుక
HIGHLIGHTS

ఈ 5310 ప్రసిద్ధ ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క ఐకానిక్ రెట్రో డిజైన్‌ను తిరిగి తెస్తుంది.

HMD గ్లోబల్ Nokia 5310 Express Music 2020 మొబైల్ ఫోన్ను భారతదేశంలో ప్రకటించింది.

గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన Nokia యొక్క Express Music సిరీస్ గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడు, HMD Global అదే ఫోన్ను మరింత ట్రెండీగా మరియు సరసమైన ధరలో Nokia 5310 Express Music 2020 ఫోనుగా, భారతదేశంలో ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ఫోన్, అదే పాత 5310 ప్రసిద్ధ ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క ఐకానిక్ రెట్రో డిజైన్ తో తిరిగి వస్తుంది. ఈ ఫోన్, సంగీత ప్రియులను అత్యధికంగా ఆకటున్న ఫోనుగా అందరికి గుర్తుండిపోయుంది. అయితే, ఈ కొత్త నోకియా 5310 పునరుద్దరించబడిన డిజైన్‌ను కలిగి ఉంది, అయితే అసలు ఫోన్ నుండి కొన్ని డిజైన్ అంశాలను తిరిగి తెస్తుంది.  

కొత్త 5310 లో డ్యూయల్ ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లు, మ్యూజిక్ కంట్రోల్ కోసం డెడికేటెడ్ బటన్లు ఉన్నాయి. అంతేకాకుండా, MP 3 ప్లేయర్, FM రేడియోతో పాటు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడింది. 2020 కోసం కొత్త నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫీచర్ ఫోన్, దాని ధర మరియు లభ్యత గురించి క్రింద  క్లుప్తంగా చూడండి.

Nokia 5310 Express Music 2020 ఫీచర్స్

ఈ కొత్త నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2020 ఫీచర్ ఫోన్‌లో 13.1 మిమీ మందంతో నిర్మించిన ప్లాస్టిక్ బాడీ ఉంది, దీని బరువు 88 గ్రాములు. ముందుగా వచ్చిన  5310 కంటే, ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ సన్నగా మరియు తేలికైనది. 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క హైలైట్ ఏమిటంటే ఇది మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ మరియు వాల్యూమ్ కోసం ప్రత్యేకమైన బటన్లతో వస్తుంది.

ఇది 320 x 240 పిక్సెల్స్ కలిగిన QVGA రిజల్యూషన్ మరియు 4: 3 యాస్పెక్ట్ రేషియోతో ఒక 2.4-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త నోకియా 5310 మీడియాటెక్ MT6260A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు నోకియా యొక్క సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32 జిబి వరకు స్టోరేజిను పెంచే ఎంపికతో 8 MB ర్యామ్ మరియు 16 MB  ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది.

ఈ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో సపోర్ట్ చేసిన VGA కెమెరా అమర్చారు. ఇయర్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి ఇది 3.5 ఎంఎం జాక్‌ను కలిగి ఉంది మరియు బ్లూటూత్ 3.0 కి మద్దతుతో వస్తుంది.

నోకియా 5310 ఫీచర్ ఫోన్ ఒక 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడివుంది. ఇది 20 గంటల టాక్ టైం వరకు అందించగలదని మరియు స్టాండ్ బై మోడ్లో 22 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Nokia 5310 Express Music 2020 ధర మరియు లభ్యత

నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2020 Price విషయానికి వస్తే, దీన్ని కేవలం 3,399 రూపాయల ధరలో మరియు రెండు రంగులలో అందించింది – తెలుపు మరియు నలుపు. ఈ ఫోన్ జూన్ 23 నుండి నోకియా ఇండియా స్టోర్ మరియు అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. నోకియా 5310 రాబోయే వారాల్లో ఆఫ్‌లైన్ మార్కెట్లలో కూడా  ప్రవేశిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo