Realme స్మార్ట్ టీవీ ఈ ప్రత్యేకతలతో రావచ్చు

HIGHLIGHTS

వెల్లడైన స్పెసిఫికేషన్లలో ఒకటి 400 నిట్స్ బ్రైట్నెస్ చూపిస్తుంది .

ఈ టీవీ 4 K రిజల్యూషన్ కు మాత్రమే కాకుండా HDR ‌కు కూడా మద్దతు ఇస్తుందని చెప్పవచ్చు.

ఈ టీవీ యొక్క కొన్ని ముఖ్య ఫీచర్లు మరియు స్పెక్స్ వెల్లడయ్యాయి.

Realme స్మార్ట్ టీవీ ఈ ప్రత్యేకతలతో రావచ్చు

రియల్మి తన టీవీ మరియు స్మార్ట్‌ వాచ్‌ను ఆన్‌లైన్ కార్యక్రమం ద్వారా మే 25 న విడుదల చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ రోజు, ఈ టీవీ  యొక్క కొన్ని ప్రత్యేకతలను కంపెనీ షేర్ చేసింది. కానీ మొత్తం కాదు, కానీ ఈ టీవీ యొక్క కొన్ని ముఖ్య ఫీచర్లు మరియు స్పెక్స్ వెల్లడయ్యాయి. ఈ టీవీ 4 K టీవీ అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు, కానీ ఈ దశలో, ఈ టీవీ 4 K రిజల్యూషన్ కు మాత్రమే కాకుండా HDR ‌కు కూడా మద్దతు ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వెల్లడైన స్పెసిఫికేషన్లలో ఒకటి 400 నిట్స్ బ్రైట్నెస్ చూపిస్తుంది . నోకియా టీవీ మరియు ఇటీవల ప్రారంభించిన కోడాక్ టీవీలలో ఇదే బ్రైట్నెస్ స్థాయి ఉంది. నోకియా మరియు కోడాక్ రెండూ Dolby Vision మద్దతునిస్తున్నాయని గొప్పగా చెబుతాయి. కాబట్టి,  రియల్మి స్మార్ట్ టీవీకి కూడా అదే విధంగా వస్తుందని మేము భావిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్మి స్మార్ట్ టీవీ : ప్రత్యేకతలు

రియల్మి స్మార్ట్ టీవీ ప్రేక్షకులకు లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని అందించడానికి స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంది. ఈ టీవీలో “క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్” కూడా ఉంది. అయితే, ఈ ఇంజిన్ ఏమి చేస్తుందనే దానిపై మరిన్ని వివరాల కోసం మనం  వేచి ఉండాలి. అయినప్పటికీ, టీవీలో 400 నిట్స్ బ్రైట్నెస్ హైలైట్ చేయబడిన చాలా ఆసక్తికరమైన స్పెసిఫికేషన్. ఈ స్పెసిఫికేషన్ ఈ ఎల్జీ గేమింగ్ మానిటర్ మరియు నోకియా టివి మరియు కోడాక్ టివిలో కూడా ఇటీవల ప్రారంభించారు. నోకియా టీవీ మరియు కోడాక్ టీవీలు రెండూ Dolby Vision ‌కు 400 బ్రైట్నెస్ కు మద్దతునిస్తున్నాయి. కాబట్టి రియల్మి టీవీ కూడా అదే మద్దతుతో వస్తుందని అంచనావేయవచ్చు. కానీ, ఈ విషయాన్ని రియల్మి ఇంకా ధృవీకరించలేదు.

రియల్మి టీవీని మీడియా టెక్ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ARM కోరెక్టెక్స్- A53 CPU మరియు మాలి 470 GPU తో నడిపిస్తుంది. 4 స్పీకర్లతో 24W స్టీరియో సౌండ్ ఉందని టీవీ పేర్కొంది. మొత్తం మీద,  4 స్పీకర్లలో 24W అంటే ప్రతి స్పీకర్‌కు 6W సౌండ్ అవుట్‌పుట్ లభిస్తుంది. ప్రతి స్పీకర్ 24W అవుట్పుట్ కలిగి ఉండటం చాలా అరుదు. అయితే,ఈ విషయ నిర్ధారణ కోసం టీవీ వచ్చే వరకూ మనం వేచి చూడాలి.

వాయిస్ అసిస్టెంట్ మద్దతు గురించి సూచించే “హే, నా రియల్మి స్మార్ట్ టీవీని ఆన్ చేయండి” అని చెప్పే ఒక చిత్రం కూడా ఉంది, అంటే గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతుతో ఆండ్రాయిడ్ టివి ప్లాట్‌ఫామ్‌లో ఈ టీవీ నడుస్తుందని అర్ధం చేసుకోవచ్చు.

టీవీ ధర లేదా స్క్రీన్ పరిమాణాల గురించి సమాచారం అందుబాటులో లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo