Realme అతి త్వరలోనే తన 43 ఇంచ్ టీవీని ప్రకటించనుంది

HIGHLIGHTS

ఈ మోడల్ 43 అంగుళాల ప్యానెల్‌ తో మాత్రమే వస్తుందని సూచిస్తుంది.

Realme అతి త్వరలోనే తన 43 ఇంచ్ టీవీని ప్రకటించనుంది

రియల్మి, ఇప్పుడు భారతదేశంలో ప్రసిద్ధ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్‌గా మారింది. స్మార్ట్‌ ఫోన్లతో పాటు, సంస్థ ఇటీవలే తన మొదటి స్మార్ట్ బ్యాండ్‌ ను కూడా విడుదల చేసింది. ఇప్పుడు రియాల్మి తన బ్రాండ్ టీవీ మరియు స్మార్ట్‌ వాచ్‌ ల కోసం కూడా పనిచేస్తోంది. గడియారం యొక్క రూపకల్పన కొన్ని లీక్‌ల ద్వారా చూడబడింది, కాని ఇప్పటికీ టీవీ గురించి మాత్రం బహిర్గతం చేయలేదు. ఇప్పుడు రాబోయే రియల్మి టీవీ గురించి ఒక కొత్త సమాచారం మాకు వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ట్విట్టర్ యూజర్ ముకుల్ శర్మ, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బిఐఎస్) లో చూసిన చిత్రాన్ని షేర్ చేశారు. ఇది కొత్త రియాల్మి టీవీ 43 "ను చూపిస్తుంది, దీనికి JSC55LSQL మోడల్ నంబర్ ఇవ్వబడింది. ఈ మోడల్ నంబర్, ఈ మోడల్ 43 అంగుళాల ప్యానెల్‌ తో మాత్రమే వస్తుందని సూచిస్తుంది.

స్క్రీన్ పరిమాణాన్ని చూస్తే, కంపెనీ తక్కువ ధర విభాగంలో మాత్రమే టీవీని లాంచ్ చేస్తుందని చెప్పవచ్చు.

ప్రారంభంలో రియల్మి టీవీని MWC 2020 లో ప్రవేశపెట్టాల్సి ఉంది. కాని, కరోనా వైరస్ కారణంగా 2 ఈవెంట్స్  రద్దు చేయబడ్డాయి. రాబోయే టీవీ గురించి మరింత సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఈ టీవీ 2020 రెండవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని తెలుస్తోంది.

రాబోయే రియాల్మి టీవీ షావోమితో భారత మార్కెట్లో పోటీ పడనుంది. అదనంగా, ఈ పోటీలో మోటరోలా, నోకియా, టిసిఎల్ మరియు వన్‌ప్లస్ మొదలైనవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు, కాని త్వరలో ఈ ఫోనుకు సంబంధించిన సమాచారం తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo