‘Coronavirus Information Hub’ ను ప్రారంభించిన Whatsapp

HIGHLIGHTS

నమ్మదగిన సమాచారం వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌లో జాబితా చేయబడతాయి.

‘Coronavirus Information Hub’ ను ప్రారంభించిన Whatsapp

ప్రపంచవ్యాప్త మహమ్మారి అంటువ్యాధికి వ్యతిరేకంగా పోరాడాలనే ఒక వైఖరిని తీసుకొని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), UNICEF మరియు UNDP  సహకారంతో 'కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్' ను ప్రారంభించినట్లు Whatsapp బుధవారం ప్రకటించింది మరియు అదనంగా, పాయింటర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్ (ఐఎఫ్‌సిఎన్) ) 1 మిలియన్ డాలర్లును విరాళంగా కూడా ఇచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి మరియు సుమారు 1,98,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు, ఇప్పటి వరకూ 7,900 మంది మరణించారు. వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ వాస్తవానికి Whatsapp.com / కొరోనావైరస్ పై ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, స్థానిక ప్రభుత్వంఈ  మరియు స్థానిక వ్యాపారులు వంటి వారికీ పరస్పర సమాచారం కోసం వాట్సాప్ మీద ఆధారపడే వారికి సులభమైన మరియు క్రియాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని, ఈ మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ బుధవారం నివేదించింది. .

వినియోగదారులు తమ చుట్టూ తిరుగుతున్న అసత్య సందేశాలు మరియు పుకార్లను తగ్గించడానికి మరియు సైట్‌లోని వ్యక్తులకు ఖచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి సాధారణ చిట్కాలను కూడా ఈ సైట్ అందిస్తుందని కూడా వివరించింది.

అదనంగా, ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ హాట్‌లైన్‌ లను అందించడానికి వాట్సాప్ WHO మరియు యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తోంది మరియు ఈ హాట్‌లైన్‌లు నమ్మదగిన సమాచారాన్ని అందిస్తాయి మరియు వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌లో జాబితా చేయబడతాయి.

ప్రస్తుతానికి, వాట్సాప్, సింగపూర్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియా వంటి అనేక దేశాలలో అనేక జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వేతర సంస్థలతో (NGO) పనిచేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo