ఇండియాలో 5G స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చే దిశగా IQOO సంస్థ అడుగులు
అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
వివో యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి, iQOO ఇప్పటి వరకూ అనేకమైన స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. అయితే, ఈ iQOO ఇప్పుడు వివో యొక్క ఉప బ్రాండ్ గా కానుండా, ఒక స్వతంత్ర బ్రాండ్ గా అవతరించిన విషయం నిన్ననే తెలియచేశాము. ఇక కొత్తగా తన ఫోన్లను సొంతగా మార్కెట్లోకి తీసుకురానున్న ఈ కొత్త సంస్థ, ఇండియన్ మార్కెట్లోకి వస్తూనే అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
Surveyఎందుకంటే, ఈ iQOO సంస్థ ఇండియన్ మార్కెట్లో ఒక 5G ఆధారిత స్మార్ట్ ఫోన్ను అత్యున్నమైన ప్రాసెసర్ తో తీసుకురానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఇండియాటుడే ముందుగా నివేదించింది. దీని ప్రకారం, ఇండిపెండెంట్ బ్రాండ్ గా ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ సంస్థ, ఒక హై ఎండ్ ప్రాసెసరుతో పాటుగా 5G సపోర్ట్ స్మార్ట్ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 865 SoC ని అందించే అవకాశం ఉందని కూడా చెబుతోంది.
ఇక ఇప్పటి వరకూ, చైనాలో ఈ వివో సబ్-బ్రాండ్ అందించిన స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, క్వాల్కమ్ వేగవంతమైన ప్రొసెసర్లు అయిన, స్నాప్ డ్రాగన్ 855 మరియు స్నాప్ డ్రాగన్ 855+ వంటి వాటితో తాను స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. వీటిలో,iQOO Neo Racing Edition ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో మరియు ఇందులో హై ఎండ్ వేరియంట్ ను స్నాప్ డ్రాగన్ 855+ SoC మరియు 12GB RAM తో పాటుగా 128GB UFS 3.0 స్టోరేజి అప్షన్లతో అఫర్ చేస్తోంది.