జోకర్ మాల్వేర్ ఎఫెక్ట్ : దీని భారినపడిన 1,700 పైగా Apps

జోకర్ మాల్వేర్ ఎఫెక్ట్ : దీని భారినపడిన 1,700 పైగా Apps

వినియోగదారులను దోచుకునే కోవకు చెందిన ఈ జోకర్ మాల్వేర్ ను చాలా అప్లికేషన్స్ (APP) లలో  కనుగొన్నట్లు గూగుల్ ప్లే స్టోర్ చెబుతోంది. ముందుగా, గత సంవత్సరంలో ఈ జోకర్ మాల్వేర్ ని కలిగి వున్నా కారణంగా 24 యాప్స్ ని తొలిగించడం జరిగింది. వాస్తవానికి, దీని గురించి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ముందుగా తెలిపింది. దీని ప్రకారం, ముందుగా ఈ యాప్స్ తొలిగించిన తరువాత, అసలు ఈ మాల్వేర్ ఎటువంటి అహాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మాత్రం గూగుల్ తెలుపలేదు. కానీ, ఇప్పుడు ఈ మాల్వేర్ గురించిన సమాచారాన్ని కొంత తెలిపినట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ జోకర్ మాల్వేర్ " లార్జ్-స్కెల్ బిల్లింగ్ ఫ్యామిలీ" కి చెందినదిగా చెబుతున్నారు. ఇది హానికరమైనది మరియు మీకు తెలియకుండానే అనైతిక పద్దతిలో, కొన్ని కంపెనీలకు మీరు పెద్ద బిల్స్ ఒకే చేసేలా చేస్తుంది. అయితే, ఇది 2017 లో యాప్స్ యొక్క SMS ల ద్వారా మోసాలకు పాల్పడేది. అయితే, గూగుల్ దీని SMS పర్మిషన్ నిలిపివేసిన తరువాత ఇది టోల్ బిల్లింగ్ మోసాలకు మళ్ళించబడింది.

అసలు ఇదెలా బిల్లింగ్ మోసం చేస్తుందంటే, టోల్ బిల్లింగ్ కోసం వినియోగదారుడు ఒక కొత్త URL ని ఎంచుకోని వారి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలనీ చూపిస్తుంది. దాన్ని ok చేసిన వెంటనే, ఇక దాని పని మొదలుపడుతుంది. ర్యాండమ్ క్లిక్స్ ద్వారా, వినియోగదారుడికి మరియు బిల్లర్స్ కూడా తెలియకుండానే పెద్ద మొత్తంలో బిల్స్ పాస్ చేస్తుంది.

కేవలం ఇదొక్కటే కాదు, ఇది ఎవరికి దొరక్కుండా యాప్స్ లో నిలిచి ఉండడానికి, అనేకరకాలైన పద్దతులను ఉపయోగిస్తుంది. అయితే, దీని భారీన పడిన 1,700 యాప్స్ ను గూగుల్ గుర్తించినట్లు మరియు వాటిని గూగుల్ స్టోర్ నుండి తొలగించినట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ మాల్వేర్ కలిగిన ఈ  యాప్స్ ను డౌన్లోడ్ చెయ్యడానికంటే  ముందుగానే గుర్తించి తొలగించినట్టు చెబుతోంది. అంటే, ఏ ఒక్కరూ కూడా దీన్ని డౌన్ లోడ్ చెయ్యలేదన్నా మాట.                            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo