కేవలం రూ.10,990 ధరకే OPPO K1 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఈ సేల్ రేపటితో ముగియనుంది.

కేవలం రూ.10,990 ధరకే OPPO K1 స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 25MP సెల్ఫీ కెమెరాతో పాటుగా AMOLED డిస్ప్లేతో ముందుగా 16,990 రుపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు Flipkart ప్రకటించిన ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ నుండి కేవలం రూ.10,990రూపాయల ధరతో అమ్ముడవుతోంది. అంతేకాదు, Axis బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడి కార్డుతో EMI ఎంపీకతో కొనేవారికి 5% అధనపు  డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ సేల్ రేపటితో ముగియనుంది.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K1 ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 19.5:19 ఆస్పెక్ట్ రేషియాతో 91%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు డిస్ప్లేలోఅంతర్గతంగా ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 512 GPU శక్తితో వస్తుంది.ఇది కనెక్టవిటీ కోసం స్నాప్ డ్రాగన్ X12 మోడెమ్ తో వస్తుంది, ఇది 600Mbps వరకు స్పీడ్ అందిస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది        

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 16MP కెమేరాకు జతగా మరొక 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరాతో ఉంటుంది.ఈ ప్రధాన కెమేరా ఒక Sony IMX 398 సెన్సార్ తో వస్తుంది. ఇక ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది   ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 ఆధారితంగా కలర్ OS 5.2 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3600mAh బ్యాటరీతో వస్తుంది మరియు పియానో బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ వంటి రెండు రంగుల ఎంపికలో లభిస్తుంది.                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo