బ్లాక్ షార్క్ 3 ఒక భారీ 16GB ర్యామ్ తో రావచ్చు
ఇది రాబోయే బ్లాక్ షార్క్ 3 5 జి కావచ్చు.
ప్రత్యేకమైన గేమింగ్ స్మార్ట్ ఫోన్, బ్లాక్ షార్క్ కు సంబంధించిన ఒక ప్రత్యేక వార్త ఇప్పుడు బయటకి వచ్చింది. ఇది భారీ గేమింగ్ వినియోగదారుకు చాలా ప్రత్యేకమైనదిగా రానున్నట్లు ఈ వార్త చెబుతోంది. మీరు అత్యధికమైన మరియు భారీ 10GB లేదా 12GB RAM ను ఉపయోగించాలని చూస్తుంటే, ఇప్పుడు మీ కోరిక మరింత పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంటర్నెట్లో వస్తున్నా ఆన్లైన్ కధనాల ప్రకారం, బ్లాక్ షార్క్ 3 ను ఒక భారీ 16 జీబీ ర్యామ్ తో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తదుపరి పెద్ద దశ అవుతుంది. ఇది జోక్ అని కొట్టిపారేయకండి, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ గురించి 16 జిబి ర్యామ్ ల్యాప్ టాప్ గురించి కాదు.
బ్లాక్ షార్క్ 3 5 G అనే డివైజ్, చైనీస్ సర్టిఫికేషన్ సైట్ MIIT చేత ధృవీకరణ పొందింది. ఇది 16 జీబీ ర్యామ్ తో ఫోన్‌ను అందించవచ్చని సర్టిఫికేషన్‌లో స్పష్టమైంది. ఇది గనుక జరిగితే, ఈ డివైజ్ 16GB RAM కలిగి ఉన్న ప్రపంచంలో ఐదవ పరికరం అవుతుంది. టిప్‌స్టర్ @ సుధాన్షు 1414 కొద్ది రోజుల క్రితం ట్వీట్ ద్వారా ఈ ధృవీకరణను వెల్లడించారు. ఈ ఫోనుకు షార్క్ KLE-AO మోడల్ నంబర్ ఇవ్వబడింది మరియు ఇది రాబోయే బ్లాక్ షార్క్ 3 5 జి కావచ్చు. సిద్ధాంతపరంగా ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 16GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది, అయినప్పటికీ మనం దీనిగురించిన అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి.
ఇక ముందుగా వచ్చిన బ్లాక్ షార్క్ 2 ప్రో గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోనులో మీరు ఒక స్నాప్ డ్రాగన్ 855+ చిప్ సెట్ ను పొందుతారు. ఇది గొప్ప పనితీరు కనబరిచే పరికరం. మీరు బ్లాక్ షార్క్ 2 ప్రో మొబైల్ ఫోనులో గొప్ప కెమెరాను కూడా పొందుతారు. ఈ మొబైల్ ఫోనులో మీరు 48MP ప్రధాన సెన్సార్ అందుకుంటారు మరియు దీనికి తోడు మీరు సెకండరీ టెలిఫోటో లెన్స్ ను కూడా పొందుతారు, ఇది 2X ఆప్టికల్ జూమ్ తో లభిస్తుంది.