ముగిసిన BSNL అధిక డేటా అఫర్, నిరాశలో వినియోగదారులు

ముగిసిన BSNL అధిక డేటా అఫర్, నిరాశలో వినియోగదారులు
HIGHLIGHTS

2019 డిసెంబర్ 31 వ తేదీతో ఈ అఫర్ ను పూర్తిగా నిలిపి వేసింది.

గత సంవత్సరంలో BSNL తన వినియోగదారులను ఆకట్టుకునేలా మంచి ప్రీపెయిడ్ ప్లానలతో పాటుగా అధనపు డేటాని కూడా ప్రకటించింది. ఈ అదనపు డేటా అఫర్ ను BSNL యొక్క అనేకమైన ప్లాన్లతో జతచేసింది మరియు 2019 సంవత్సరంలో చాలాసార్లు ఈ అఫర్ యొక్క వ్యాలిడిటీ కాలాన్ని కూడా పెంచుతూ వచ్చింది. అయితే, 2019 డిసెంబర్ 31 వ తేదీతో ఈ అఫర్ ను పూర్తిగా నిలిపి వేసింది. దీనితో, ప్రస్తుతం BSNL వినియోగదారులు కొంత అసహనానికి మరియు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్నీ ముందుగా టెలికం టాక్ నివేదించింది. అయితే, వాస్తవికతను పరిశీలిస్తే, గత సంవత్సరంలో అనేకమైన ప్లాన్ల పైన 2 నుండి 3GB వరకూ అధిక డేటాని ప్రకటించింది. కానీ, ప్లాన్స్ కేవలం 2 నుండి 3GB డేటాని మాత్రమే అందిస్తున్నాయి. గత సంవత్సరంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ముఖ్యంగా తన 5 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.2 GB అధిక డేటాని ప్రకటించింది.

 వీటిలో , Rs 186, Rs 429,Rs 485,Rs 666, మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అయినటువంటి Rs 1699 పైన కూడా ఈ 2.2 GB రోజువారీ అధిక డేటాని అందించింది. అయితే, ముందుగా, జూలై 30 వ తేదీతో ఈ ప్రణాళికల పైన అధిక ఉచిత డేటా అఫర్ ముగుస్తుందని ప్రకటించినా, వీటిపైన వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ ప్రణాళికలను అక్టోబరు 1వ తేది  2019 వరకు అందుబాటులో ఉంచింది. చివరిగా, దీన్ని సంవత్సరం చివరి వరకూ అంటే 2019 డిసెంబర్ 31 వరకూ చాలా ప్లాన్స్ పైన ఈ అఫర్ ను కొనసాగించింది. కానీ, ఇప్పుడు కేవలం సాధారణ డేటా మాత్రమే ఇవ్వడం నిరాశపరిచేదిగా ఉన్నదని వినియోగదారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo