అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2 నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు
ప్రైమ్ సభ్యుల కోసం ఈ డీల్స్ ను ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చింది.
అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరొక సరి ప్రారంభమైంది, అయితే, ఈరోజు కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే. ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక డీల్స్ గురించి చుడనున్నాము. మీరు మంచి డీల్స్ తో కొనగల స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తూన్నట్లైయితే ఈ స్మార్ట్ ఫోన్ల డీల్స్ చూడవచ్చు. అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు జరుగుతుంది, కాని ప్రైమ్ సభ్యుల కోసం ఈ డీల్స్ ను ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ నుండి ICICI డెబిట్ మరియు క్రెడిట్ కారులతో ప్రొడక్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Readmi 7 A
MRP : రూ .6,999
ఈ రెడ్మి 7 ఎ యొక్క 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం 5,499 రూపాయలకు లభిస్తుంది. రెడ్మి7 ఎ ఫోన్ ఒక 5.45 అంగుళాల హెచ్డి + డిస్ప్లే మరియు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 486 సెన్సార్ ఉంది. ఈ ఫోనులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం PDAF, ఆటో హెచ్‌డిఆర్ మరియు సింగిల్-టోన్ ఫ్లాష్‌తో వస్తుంది, అంతేకాకుండా సెల్ఫీ కెమెరా AI బ్యాక్‌గ్రౌండ్ బ్లర్రింగ్ మరియు AI బ్యూటిఫికేషన్ మోడ్లకు మద్దతు ఇస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M 30
MRP : రూ .16,490
ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ M 30 గురించి మాట్లాడితే, ఈ పరికరం రూ .11,999 కు లభిస్తుంది. ఈ పరికరం 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎం 30 ఇన్ఫినిటీ-యు నాచ్‌తో ఒక 6.4-అంగుళాల పూర్తి హెచ్డి + సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ SoC ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.
Redmi Y 3
MRP : రూ .11,999
రెడ్మి వై 3 స్మార్ట్‌ఫోన్ కేవలం 7,999 రూపాయలకు ధరకు లభిస్తుంది. ఈ రెడ్మి వై 3 లో, మీరు HD + ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లేని ఒక 6.26 అంగుళాల డాట్ నాచ్ డిజైనుతో పొందుతారు. అలాగే, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇవ్వబడింది. ఈ పరికరం సొగసైన బ్లూ, బోల్డ్ రెడ్ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్లో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఒక ఆరా ప్రిజం డిజైన్‌తో వస్తుంది.
OnePlus 7 Pro
MRP: రూ .48,999
వన్ ప్లస్ కొత్తగా లాంచ్ చేసిన ఈ OnePlus 7 Pro స్మార్ట్ ఫోన్ రూ .42,999 వద్ద 12% తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.67-అంగుళాల QHD స్క్రీన్ మరియు 48 MP ప్రైమరీ సెన్సార్ ఒక ఎపర్చరు ఎఫ్ / 1.7 తో మరియు సెకండరీ 8MP టెలీఫోటో సెన్సారుకు జతగా 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP పాప్ అప్ సెల్ఫీ ఇవ్వబడింది. ఈ ఫోన్, ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది.
Apple iPhone XR
MRP : రూ .54,900
ఈ ఆపిల్ ఫోన్ పైన 13% తగ్గింపు తరువాత, మీరు దీన్ని 47,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మరియు ఈ వేరియంట్లో A12 బయోనిక్ చిప్ తో వస్తుంది మరియు ఇది IP 67 సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ నుండి రక్షణ నిస్తుంది.
Nokia 8.1
MRP: రూ .28,831
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఈ నోకియా స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ నోకియా 8.1 ఫోనులో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడుతుంది, మరియు కెమేరాల పరంగా చాల బాగుటుంది. ఈ ఫోన్‌ను ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో అందించారు.