108 MP కెమేరాతో లాంచ్ అయిన షావోమి మి మిక్స్ ఆల్ఫా : పీక్స్ లో స్పెక్స్
షావోమి మి మిక్స్ ఆల్ఫా మొబైల్ ఫోన్ మీకు డ్యూయల్ సిమ్ 5 జి కనెక్టివిటీని, అలాగే 108MP కెమెరా వంటి అత్యున్నమైన ప్రత్యేకతలతో వస్తుంది.
చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో, నేడు షావోమి యొక్క Mi 9 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబడింది, ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌తో MIUI 11 స్కిన్ తో కూడా ప్రవేశపెట్టబడింది. అయితే, ఈ ఈవెంట్ లో లాంచ్ చేసిన మి మిక్స్ ఆల్ఫా మొబైల్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలచింది,అంతేకాదు ఇది ప్రపంచంలో ర్యాపారౌండ్ సరౌండ్ డిస్ప్లేతో లాంచ్ చేయబడిన మొట్టమొదటి స్మార్ట్ఫోనుగా నిలచింది . షావోమి మి మిక్స్ ఆల్ఫా మొబైల్ ఫోన్ మీకు డ్యూయల్ సిమ్ 5 జి కనెక్టివిటీని, అలాగే 108MP కెమెరా వంటి అత్యున్నమైన ప్రత్యేకతలతో వస్తుంది.
Surveyషావోమి మి మిక్స్ ఆల్ఫా : ప్రత్యేకతలు
అయితే, షావోమి మి మిక్స్ ఆల్ఫా మొబైల్ ఫోన్ స్క్రీన్ పరిమాణం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలువడలేదు. కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీకు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, అలాగే ఫోన్లో 12 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ దూసుకొచ్చింది. ఇది యుఎఫ్ఎస్ 3.0 స్టోరేజ్ తో వస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కూడా అందుతుంది, ఇందులో 40W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇక ఫోటోగ్రఫీ విషయానికి, ఈ మొబైల్ ఫోన్లో మీరు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుకోనున్నారు. ఇందులో మీకు మొట్టమొదటి సారిగా ఒక 108MP ప్రధాన కెమెరాతో పాటు 20MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక 12MP టెలిఫోటో లెన్స్‌ని కలగలిపి అందిస్తుంది. అయితే, మీరు ఫోన్లో సెల్ఫీ కెమెరా మాత్రం ఇవ్వలేదు. అయితే, మీరు సెల్ఫీ లేదా ఫ్రంట్ వీడియో చేయాలనుకుంటే, మీరు ఫోన్‌ను తిప్పాలి. వెనుకవైపు ఉన్న స్క్రీన్ మీ కోసం వ్యూఫైండర్‌గా పనిచేస్తుంది.
షావోమి మి మిక్స్ ఆల్ఫా ఫోన్‌ను RMB 19,999 ధరతో లాంచ్ చేశారు, ఇది మనకు సుమారు 200,800 రూపాయల ధరతో సమానం. మీరు ఈ మొబైల్ ఫోన్‌ను డిసెంబర్ నుండి తీసుకోవచ్చు, ఎందుకంటే అదే నెలలో ఇది అమ్మకానికి రానుంది. అయితే, ఈ మొబైల్ ఫోన్‌ను ఎప్పటివరకు భారత్ లో తీసుకురాబోతున్నారనే దానిపై సమాచారం లేదు.