48MP కెమేరా పోయే.. 64MP కెమేరా వచ్చే

HIGHLIGHTS

ఇప్పటి వరకూ 48MP కెమేరాతో వచ్చే ఫోన్లు అధికమైన రిజల్యూషన్ అందించేదిగా నిలచింది.

64MP AI Quad Camera స్మార్ట్ ఫోన్ను తీసుకురావడానికి, రియల్మీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

48MP కెమేరా పోయే.. 64MP కెమేరా వచ్చే

ప్రస్తుతం, మొబైల్ తయారీ సంస్థల మధ్య కెమేరా వార్ నడుస్తున్నట్లు అనిపిస్తోంది. వాస్తవానికి, వినియోగదారులు కూడా మంచి కెమేరాలతో పాటుగగా అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చెయ్యడానికి మొగ్గుచూపడంతో, అన్ని ప్రధాన మొబైల్ తయారీ సంస్థలు కూడా అటువైపుకే పరుగులు తీస్తున్నాయి. ఇప్పటి వరకు, సింగిల్, డ్యూయల్, ట్రిపుల్ కెమేరాలు అంతెందుకు ఏకంగా 5 కెమేరాలతో కూడా ఫోన్లు అంధుబాటులో వున్నాయి. ఇక మెగా పిక్సెళ్ళ విషయానికి వస్తే, ఇప్పటి వరకూ 48MP కెమేరాతో వచ్చే ఫోన్లు అధికమైన రిజల్యూషన్ అందించేదిగా నిలచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది ప్రస్తుతం వరకూ మాత్రమే. ఎందుకంటే, అందరికంటే ముందుగా ఒక 64MP ప్రధాన సెన్సార్ కలిగిన ఒక క్వాడ్ కెమేరా సేటప్పుతో ఒక సూపర్ కెమేరా కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకురావడానికి, రియల్మీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోను గురించిన మరిన్ని వివరాలు తెలియరాలేదు కానీ, ఈ ఫోనుతో తీసినట్లు చెబుతున్న ఒక ఫోటోను మాత్రం రియల్మీ తన ట్విట్టర్ హ్యాండిల్ల్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఎడమ వైపున క్రింద భాగంలో 64MP AI Quad Camera మరియు Shot On Realme అని కనిపిస్తోంది. అంటే ఇది త్వరలో ఈ సంస్థ తీసుకురానున్న సూపర్ కెమెరా ఫోన్ నుండి తీసిన చిత్రాలుగా అనుకోవచ్చు.

 

 

ఈ ట్విట్ ప్రకారంగా, ఈ 64MP GW1  సెన్సార్ 1/1.72 అంగుళం పరిమాణంలో పెద్దగా మరియు అతితక్కువ కాంతిలో కూడా ఫోటోలను అత్యున్నత బ్రైట్నెస్ తో తీయగేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ, కేవలం 48MP కెమేరాని అంటిపెట్టుకుని అన్ని ప్రధాన కంపెనీలు కూడా తమ స్మార్ట్ ఫోన్లను తీసుకురాగా, అన్నింటికన్నా ముందుగా దీని గురించి ప్రకటించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది, రియల్మీ సంస్థ.                         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo