మీ ఇష్టాన్ని బట్టి నచ్చిన కలర్ ను మార్చుకునేలా, ఒక స్మార్ట్ LED బల్బును తీసుకొచ్చింది, షావోమి. అంటే కేవలం ఒక్క బల్బుతో అనేక రంగులను మార్చుకోవచ్చన్న మాట. అంతేకాకుండా, మి హోమ్ మొబైల్ ఆప్ తో మనకు కావాల్సిన విధంగా, అనేక రకాలైన రంగులను సెట్ చేసుకోవచ్చు మరియు స్టూడియో లాంటి వాతావరణాన్ని గదిలోనే సృష్టించుకోవచ్చు. అంతేకాదు, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ తో పనిచేసే ఈ స్మార్ట్ బల్బ్ మరెన్నో ప్రత్యేకతలతో వస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
షావోమి LED స్మార్ట్ బల్బ్ ప్రత్యేకతలు :
ఈ స్మార్ట్ LED బల్బ్ చూడటానికి మన సాధారణ LED బల్బుల వలెనే కనిపిస్తుంది. కానీ, ఇది అందించే కలర్ వైవిధ్యాలను చూస్తే, నిజంగా ఆశ్చర్యతోవాల్సిందే. ఎందుకంటే, ఇది 16M కలర్ ఎంపికలతో వస్తుంది. అవును మీరు విటుంది నిజమే, దీనితో ఈ 16 మిలియన్ కలర్ అప్షన్లలో కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, దీన్ని మీ మొబైల్ ఫోనుతో కంట్రోల్ చేయ్యవచ్చు మరియు 11 సంవత్సరాల దీర్ఘ కాలం పనిచేసేలా దీన్ని అందించింది షావోమి సంస్థ.
అధనంగా, ఈ షావోమి స్మార్ట్ LED బల్బు Alexa మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వాటికీ అనుగుణముగా నడుచుకుంటుంది, అంటే వాటి ఆజ్ఞలను పాటిస్తుంది. ఈ విషయం నిజంగా మెచ్చుకోతగినది మరియు ఇప్పటి వరకు ఎవరికి రానటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు. అలాగే, దీన్ని మనం క్యాండిల్ లైట్, స్టూడియో లైట్, మ్యాచ్ లైట్, లేదా ఫ్లోరా సేంట్ లాంప్ లాగా అనేక విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని Mi Home App తో చక్కగా మరియు సులభంగా కంట్రోల్ చెయ్యవచు. ఇది 10W సామర్ధ్యంతో వస్తుంది మరియు Mi Crowdfunding నుండి అమ్మకాలను మొదలు పెట్టనుంది. ఈ LED స్మార్ట్ బల్బ్ ను రూ. 1,299 రూపాయల ధరతో విక్రయిస్తోంది.