షావోమి ‘హెర్క్యులస్’ ఫోన్నుఫ్లాగ్షిప్ కిల్లర్ గా తీసుకురానుంది
షావోమి నుండి ఇప్పుడు మరొక ప్రత్యేకమైన ఫోన్ రానున్నట్లు, ప్రస్తుతం వస్తున్న రూమర్లు మరియు నివేదికల ద్వారా తెలుస్తోంది.
మార్కెట్లో ఎటువంటి స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తే, ప్రజలు ఇష్టపడతారో అటువంటి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో తీసుకురావడంలో ముందంజలో వుండే, షావోమి నుండి ఇప్పుడు మరొక ప్రత్యేకమైన ఫోన్ రానున్నట్లు, ప్రస్తుతం వస్తున్న రూమర్లు మరియు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు గొప్ప ఫీచర్లతో తీసుకురానున్నట్లు కూడా కొంతమంది చేస్తున్న ట్వీట్స్ ద్వారా అర్ధమవుతోంది.
Surveyఉప బ్రాండ్ గా మారిన రెడ్మి నుండి స్మార్ట్ ఫోనులు వెంటవెంటనే లాంచ్ చేస్తుండగా, Mi నుండి ఒక కొత్త ఫోన్ వచ్చిమాత్రం చాలా రోజులే అవుతుంది. అయితే, ఈ నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ, అన్నీ ప్రధాన ప్రత్యేకతలు మరియు ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోను తీసుకురానున్నట్లు ప్రస్తుతం ఆన్లైన్లో వస్తున్న అనేక రిపోర్ట్స్ వివరిస్తున్నాయి. అదీకూడా, ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరుతో రానున్నట్లు, XDA- డెవలపర్ మనీష్ రెహమాన్ పంచుకున్న ఒక ట్వీట్ ద్వారా తెలుస్తోంది.
ఈ ట్వీట్ ప్రకారం, రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 'హెర్క్యులస్' అనే కోడ్ నేమ్ తో రానున్నట్లు, అదీకూడా ప్రపంచవ్యాప్తంగా అదేపేరుతో తీసుకురానున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఫోన్, ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరు మరియు గొప్ప సామర్ధ్యం కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాతో అందించనునట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ ఫోన్ డిస్ప్లేలో అంతర్గతంగా ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రిన్ సెన్సార్ మరియు వైర్ లెస్ ఛార్జింగ్ తో కూడిన NFC తో ఉండనున్నట్లు కూడా తెలిపారు. అయితే, ఈ స్మార్ట్ ఫోను పేరును మాత్రం సూచించలేదు, కానీ మరొక టిప్‌స్టర్ ఇది Mi Mix 4 లేదా Mi Mix 3S గా ఉండవచ్చని ముందస్తు అంచనాలను చేశారు.