నోకియా 4.2 ఇండియాలో లాంచ్ అయ్యింది : ధర, ప్రత్యేకతలు మరియు ఆఫర్ల గురించి క్లుప్తంగా
నోకియా నుండి వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది
HMD బడ్జెట్ రేంజ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని, తన నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. నోకియా నుండి వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. అంతేకాదు, గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక ప్రత్యేకమైన బటన్ ఈ స్మార్ట్ ఫోనులో అందించింది. అలాగే, ఈ ధర పరిధిలో సరిపడేలా ఒక పెద్ద 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని కూడా అందించింది.
Surveyనోకియా 4.2 ప్రత్యేకతలు
ఈ నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 720 x 1520 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.71 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో రానున్నది. అధనంగా, ఈ డిస్ప్లేని ఒక U ఆకారంలో వున్న నోచ్ డిజైన్ తో అందించారు మరియు ఈ నోచ్ లో సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది. ఇది 3GB ర్యామ్ కి జతగా 32GB స్టోరేజితో లభిస్తుంది. అలాగే, మైక్రో SD కార్డుతో 400GB వరకు మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలుంటుంది.
ఇక కెమెరా విభాగానికి వస్తే, f/2.2 అపర్చరు కలిగిన ఒక 13MP ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP ( f/2.2) డెప్త్ కెమేరాతో, డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు. ముందుభాగంలో, ఒక 8MP కెమేరాని f /2.0 అపర్చరుతో అందించారు. అయితే, ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది. ఇందులో 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని అందించింది. ఇది Android 9 Pie OS పైన నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి అప్డేట్లను త్వరగా అందుకుంటుంది.
నోకియా 4.2 ధర మరియు ఆఫర్లు
ఈ నోకియా 4.2 3GB ర్యామ్ + 32GB స్టోరేజితో లభిస్తుంది, ఇది రూ. 10,990 ధరతో విడుదల చేయ్యబడింది. ఇది పింక్ శాండ్ మరియు బ్లాక్ వంటి రంగులలో లభిస్తుంది. ఇది ప్రత్యేకంగా ఈ రోజు నుండి 7 రోజుల కోసం nokia.com /phones నుండి అందుబాటులో ఉంటుంది. తరువాత, మే 14 వ తేది నుండి క్రోమా, రిలయన్స్ డిజిటల్, సంగీత, పూర్వీక, Big c మరియు MyG వంటి రిటైల్ అవుట్ లెట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక మే 21 నుండి అన్ని రిటైల్ అవుట్ లెట్లలో లభిస్తుంది.
ఈ ఫోను ఆఫర్లలో భాగంగా, జూన్ వరకు కొనుగోలు చేసేవారికి Rs 500 తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ అఫర్ పొందాలనుకునే వారు nokia ఆన్లైన్ షాప్ నుండి "LAUNCHOFFER" ద్వారా దీని పొందవచ్చు. HDFC యొక్క కార్డ్స్ మరియు EMI ద్వారా కొనేవారికి 10శాతం వరకూ క్యాష్ బ్యాక్ అందుతుంది. అలాగే వోడాఫోన్ – ఐడియా వినియోగదారులు 2500 రూపాయల విలువగల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అఫర్ వర్తింప చేసింది. అయితే, ఈ మొత్తం 50రూపాయల విలువగల 50 వోచర్ల రూపంలో అందిస్తుంది, అదీకూడా 199 మరియు అంతకంటే ఎక్కువ రీచార్జి చేస్తే మాత్రమే.