BSNL బంపర్ అఫర్ : ఇప్పుడు రూ. 999 ప్రీపెయిడ్ ప్లానుతో ఏకంగా 561 GB డేటా పొందవచ్చు

HIGHLIGHTS

ఈ ప్రీపెయిడ్ ప్లానుతో అన్లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు.

BSNL బంపర్ అఫర్ : ఇప్పుడు రూ. 999 ప్రీపెయిడ్ ప్లానుతో ఏకంగా 561 GB డేటా పొందవచ్చు

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటిస్తూ మార్కెట్లో తన ప్రాముఖ్యతను చాటుకుంటుంది BSNL. ఇప్పటి వరకు, కేవలం ప్రవేటు టెలికం సంస్థలు మాత్రమే తమ ప్లాన్లను ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటుండగా, ఇపుడు వాటికీ పోటీగా ఈ ప్రభత్వ టెలికాం సంస్థ కూడా నిలుస్తోంది. ఇటీవలే, బంపర్ అఫర్ ద్వారా కొన్ని ప్రీపెయిడ్ ప్లానుల పైన రోజువారీ 2.1 GB అధిక డేటాని BSNL ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం, BSNL తన రూ. 999 ప్రీపెయిడ్ ప్లానులో మార్పులను చేసింది మరియు ఇందులో భాగంగా వినియోగధారులకి అధిక డేటాని అందిస్తోంది. ఇప్పుడు ఈ రూ. 999  ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 3.1 GB డేటా మరియు 181 రోజుల వ్యాలిడిటితో పొందవచ్చు. ఒకవేళ ఈ రోజువారీ డేటా పరిమితి దాటినట్లయితే, స్పీడ్ 40 Kbps కి తగ్గించబడుతుంది మరియు ఈ స్పీడుతో అపరిమితంగా వాడుకోవచ్చు.

BSNL.jpg

అంటే, రోజువారీ 3.1 GB డేటాతో 181 రోజులకుగాను మొత్తంగా 561.1GB డేటాని పొందవచ్చు. ఈ ప్లాన్ దేశమంతటా 19 సర్కిళ్లలో అన్నదుబాటులో ఉంటుంది. కానీ, కేరళలో ఈ ధర ప్లాన్ వేరొక మొత్తం డేటాతో అందుబాటులో ఉంటుంది. ఇటీవలే, BSNL రెండు సరికొత్త రూ. 1,699 మరియు రూ. 2,099 ప్రీపెయిడ్ ప్లాన్లను  కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లానలతో కూడా మంచి డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందుకోవచ్చు.                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo