వైల్డ్ గా దర్శనమిచ్చిన శామ్సంగ్ గెలాక్సీ S10 + యొక్క 5G వేరియంట్

HIGHLIGHTS

5G అనేది చాలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు మరియు టెలికాం కంపెనీల మధ్య పెద్ద చర్చ అనిచెప్పవచ్చు

వైల్డ్ గా దర్శనమిచ్చిన శామ్సంగ్ గెలాక్సీ S10 + యొక్క 5G వేరియంట్

గత కొన్ని సంవత్సరాలుగా, 5G అనేది చాలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు మరియు టెలికాం కంపెనీల మధ్య పెద్ద చర్చ అనిచెప్పవచ్చు. 2018 మొదలు నుండి చివరి వరకూ కూడా, ఈ 5G చుట్టూ ఉత్సుకత మరియు ప్రకటనలు చాలానే చేశాయి మరియు కొన్ని కంపెనీలు ఇప్పటికే 2019 కోసం 5G స్మార్ట్ ఫోన్లను  తయారు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనచేసిన కంపెనీలలో శామ్సంగ్ కూడా ఉంది, ఇది ఇటీవలి కాలంలో హవాయిలో జరిగిన క్వాల్కామ్ టెక్ సమ్మిట్ లో తన 5G ప్రోటోటైప్ ని చూపించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ శామ్సంగ్ గెలాక్సీ S10 మరియు శామ్సంగ్ గెలాక్సీ S10 + చుట్టూ కొన్ని ఊహాగానాలు మరియు పుకార్లు గత కొన్ని వారాల్లో చాలానే వచ్చాయి, ఇప్పుడు ఈ ఫోన్ల గురించిన ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే,  మోడల్ సంఖ్య SM-G977 తో శామ్సంగ్ గెలాక్సీ S10 + యొక్క 5G వేరియంట్ ఉండవచ్చు. US లో మల్టీ కెరియర్స్ దాని 5G పరికరం గురించి శామ్సంగుతో పనిచేస్తున్నాయి, కానీ ఈ కొరియా టెక్ దిగ్గజం ఏలాంటి విషయాన్నికూడా తెలియచేయడాన్ని నిరాకరిస్తుంది.

గెలాక్సీ క్లబ్ ప్రకారం, SM-G977U మరియు SM-G977N రెండు మోడల్ సంఖ్యలతో, రాబోయే ఈ ఫ్లాగ్షిప్ యొక్క 5G మోడల్ను గుర్తించారు. ఇవి US మార్కెట్ కోసం ఒకటి మరియు దక్షిణ కొరియా మార్కెట్లో మరొకదాని కోసం, రెండు దేశాల – నిర్దిష్ట రకాలుగా ఉండవచ్చని, సూచించారు కానీ U మరియు N ప్రత్యయంగా. యూరప్ లో, శామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ F సఫిక్స్ ను కలిగి ఉండడంతో అది ఇంకా మోడల్ జాబితాలో ఉన్నట్లు కనపడలేదు. US మరియు దక్షిణ కొరియాలు రెండు దేశాలు కూడా 5G విస్తరణ సాధ్యమైన పరిధిలోవున్నా దేశాలు కావడంవలన ఇలా చేసివుండొచ్చు.

ప్రస్తుతానికి, శామ్సంగ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్స్ స్మార్ట్ ఫోన్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. శామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్, ఈ సంవత్సరం అనేక రకాలలో రానున్నట్లు, ఒక లైట్ వేరియంట్ సహా అనేక పుకార్లు వచ్చాయి. సాధారణంగా, శామ్సంగ్ వారి S శ్రేణి ఫ్లాగ్షిప్ పరికరాలను మొబైల్ వరల్డ్ కాంగ్రెసుకు  ముందు ఒక కార్యక్రమంలో ప్రకటించింది మరియు శామ్సంగ్ ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదు. శామ్సంగ్ ఈ కార్యక్రమంలో S10 మరియు S10 + యొక్క 5G వేరియంట్ను ప్రకటించాలా లేదా తరువాతి తేదీ గురించి మనకు తెలియచేయనున్నదనే విషయాన్ని ఖచ్చితంగా తెలియచేయలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo