3PM కి మరొకసారి, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో బ్లాక్ ఫ్రైడే సేల్

HIGHLIGHTS

ధర రూ. 12,999 కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే

3PM కి మరొకసారి, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో  బ్లాక్ ఫ్రైడే సేల్

ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా సేల్ మొదలు పెట్టిన కొద్దీ సేపటిలోనే, స్టాక్ మొత్తం పూర్తిగా అమ్ముడయ్యాయి. అలాగే, mi.com లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు కనిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం 'బ్లాక్ ఫ్రైడే సేల్' సందర్భముగా, ఈ ఫోన్ పైన 1000 ధరను తగ్గించి అమ్మడమే. అయితే mi.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మరొకసారి సేల్ ప్రారంభంకానుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 6 ప్రో 'బ్లాక్ ఫ్రైడే సేల్'  ధరలు 

 సాధారణ ధర : 4GB RAM + 64GB స్టోరేజి వెర్షన్ ధర రూ. 13,999

బ్లాక్ ఫ్రైడే సేల్  : 4GB RAM + 64GB స్టోరేజి వెర్షన్ ధర రూ. 12,999

 సాధారణ ధర : 6GB RAM + 64GB స్టోరేజి వెర్షన్ ధర రూ. 15,999

బ్లాక్ ఫ్రైడే సేల్  : 6GB RAM + 64GB స్టోరేజి వెర్షన్ ధర రూ. 14,999 

అయితే, . కేవలం ఈఒక్కరోజు కోసం, ఈ ఫోన్ యొక్క రెండు వేరియంట్లను 1000 రూపాయల రాయితీతో అందిస్తుంది. 

Xiaomi కూడా ఈ స్మార్ట్ ఫోనుతో ఒక స్లిమ్ కేసు అందిస్తోంది మరియు Jio వినియోగదారులు Rs 2,400 తక్షణ క్యాష్ బ్యాక్ మరియు హ్యాండ్సెట్ తో  6TB వరకు 4G డేటా పొందుతారు. HDFC కార్డు ఉపయోగించి ఈ ఫోను కొనుగోలు చేసినట్లయితే, 500 రూపాయలు తక్షణ క్యాష్ బ్యాక్ పొందుతారు.

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో – స్పెసిఫికేషన్స్

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఆడ్రినో 509 GPU శక్తితో వస్తుంది. ఇది 19: 9 కారక నిష్పత్తిలో కొంచెం పెద్ద ఒక 6.26-అంగుళాల Full HD + IPS LCD డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 86 శాతం స్క్రీన్ నుండి బాడీ నిష్పత్తి, మరియు దాని స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ 500 nits ఇంకా ఇది ఒక 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది . ఈ ఫోన్ 64GB అంతర్గత నిల్వతో పాటు 4GB మరియు 6GB RAM తో వస్తుంది. అలాగే, మైక్రో SD కార్డుతో దీని స్టోరేజిని 256GB వరకు విస్తరించవచ్చు.  

ఆప్టిక్స్ పరంగా చుస్తే, Redmi Note 6 ప్రో డ్యూయల్  12 + 5 MP సెన్సార్స్ కలిగి వస్తుంది. ఈ 12 MP సెన్సార్ 1.4um పిక్సెళ్ళు మరియు డ్యూయల్  ఆటో-ఫోకస్ మద్దతుతో f / 1.9 ఎపర్చరును కలిగి ఉంది. రెండవ సెన్సార్ 5MP డీప్ సెన్సార్. అలాగే ముందు, ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది. ముందు కెమెరా ప్రాక్సిమిటీ / పరిసర కాంతి సెన్సర్, స్పీకర్ మరియు నోటిఫికేషన్ లైట్తోపాటు, నోచ్ లోపల ఉంచబడుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ 4000mAh బ్యాటరీ చేత శక్తి పొందుతుంది, ఇది ఒక పూర్తి ఛార్జ్ తో 2 రోజులు వరకు పనిచేస్తుందని సంస్థ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo