Xiaomi Mi Notebook Air ని గత ఏడాది జూలై లో ప్రవేశ పెట్టింది . మరియు ఇప్పుడు ఒక తాజా లీక్ లో కంపెనీ త్వరలో దీని కొత్త వేరియంట్ ప్రవేశ పెట్టబోతోంది. ఇది 7th జనరేషన్ ఇంటెల్ ప్రోసెసర్ వస్తుంది . ఈ డివైస్ ప్రెస్ రెండర్ తో లీక్ అవుతుంది మరియు దీని ఫుల్ స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి . ఈ కొత్త లాప్టాప్ యొక్క డిసైన్ ఓల్డ్ వేరియంట్ లానే ఉంటుంది కానీ కొత్త వేరియంట్ లో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు
Surveyఈ కొత్త నోట్ బుక్ ఎయిర్ లో Mi Notebook Air లో కొత్త 7th జనరేషన్ ఇంటెల్ కోర్ i5-7200U ప్రోసెసర్ కలదు. దీని బేస్ క్లాక్ స్పీడ్ 2.5GHz మరియు దీని మాక్స్ క్లాక్ స్పీడ్ 3.1GHz ఉంటుంది . మరియు దీనిలో 8GB రామ్ మరియు 128GB అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ కలవు .
ఈ కొత్త xiaomi Mi Notebook లో బ్లూటూత్ 4.0, వైఫై మరియు ఒక సిమ్ కార్డు స్లాట్ కూడా కలదు. దీనిలో 4- సెల్ బ్యాటరీ కూడా కలదు , వాదనల ప్రకారం 9.5 గంటల రన్ టైం ఇస్తుంది . ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో USB టైపు -C స్లాట్ కూడా కలదు.