Samsung Galaxy S8 plus యొక్క 6GB RAM వేరియంట్ భారత్ లో లాంచ్

HIGHLIGHTS

Samsung Shop మరియు Flipkart లో శుక్రవారం , 2 జూన్ నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చును.

Samsung Galaxy S8 plus  యొక్క  6GB  RAM  వేరియంట్  భారత్  లో లాంచ్

 మొబైల్ నిర్మాణ  దిగ్గజం  Samsung  యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్  Samsung Galaxy S8 plus  యొక్క  6GB  RAM  వేరియంట్  ఇండియాలో లాంచ్ చేయబడింది .  ఈ డివైస్ లో ఇంటర్నల్ స్టోరేజ్  128GB . 
 ఈ వేరియంట్ భారత్ లో  8  జూన్ నుంచి అందుబాటులోకి వస్తుంది .  ఈ డివైస్ యొక్క ధర  Rs. 74,990  ఉంటుంది .  ఈ వేరియంట్ ని  Samsung Shop  మరియు  Flipkart  లో శుక్రవారం , 2  జూన్ నుంచి ప్రీ  ఆర్డర్  చేసుకోవచ్చును.  
ఈ ఫోన్ లో  5.8 ఇంచెస్ మరియు గాలక్సీ  S8  ప్లస్ లో  6.2  ఇంచెస్  QHD Super AMOLED  డిస్ప్లే లు వున్నాయి .   ఈ రెండు ఫోన్స్  IP68  సర్టిఫికేషన్   పొందాయి.  అంటే ఇవే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నమాట .
గాలక్సీ  S8  లో AI  అసిస్టెంట్  'Bixby' కలదు .  ఈ ఫీచర్  వాయిస్  కమాండ్  పై  పని చేస్తుంది మరియు యూజర్  యొక్క ప్రశ్నలకి  ఆన్సర్  చేస్తుంది.  అంతే కాకుండా ఈ డివైస్ లో  4GB  RAM  మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAH  అలాగే  S8  ప్లస్ లో 3500mAh  బాటరీ కలిగి వైర్  లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది .
ఈ డివైస్ లో రేర్ కెమెరా  12 ఎంపీ మరియు  ఫ్రంట్  5  ఎంపీ కలవు .   Samsung galaxy S8  మరియు  S8 plus  రెండు డివైస్  లోను   బియోమెట్రిక్ అతెం టికేషన్  ఫీచర్ కలదు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo