Aadhaar Pan Card Link గడువు రేపటితో ముగుస్తుంది.. ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.!
Aadhaar Pan Card Link చేయడానికి ప్రభుత్వం విధించిన ఆఖరి గడువు రేపటితో ముగుస్తుంది
ఈ గడువు మూసే లోపు లింక్ చేయని ప్రతి ఒక్కరు కూడా విధిగా పాన్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయాలి.
మీ పాన్ కార్డు తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది
Aadhaar Pan Card Link చేయడానికి ప్రభుత్వం విధించిన ఆఖరి గడువు రేపటితో ముగుస్తుంది. ఈ గడువు మూసే లోపు ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ చేయని ప్రతి ఒక్కరు కూడా విధిగా పాన్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయాలి. అలా చేయని పక్షంలో జనవరి 1వ తేదీ నుంచి మీ పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. ఇలా జరిగితే, మీ పాన్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయలేక పోవడం లేదా ట్రాన్స్ఫర్ చేయలేక పోవడంతో పాటు మీ అకౌంట్ నిర్వహించడానికి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, ఈ రోజే మీ ఆధార్ పాన్ కార్డు లీక్ చేయడం ఉత్తమంగా ఉంటుంది.
SurveyAadhaar Pan Card Link స్టేటస్ చెక్ చేయండి
మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో ముందుగా చెక్ చేయండి. ఒకవేళ పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే, అప్పుడు లింక్ చేయండి. స్టేటస్ చెక్ చేయడం చాలా సులభంగా. ఎందుకంటే, పాన్ ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ సులభమైన మార్గం అందించింది. స్టేటస్ చెక్ చేయడానికి, ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అఫీషియల్ వెబ్‌సైట్ ను తెరవండి. ఇందులో మెయిన్ పేజీ రైట్ సైడ్ లో ఉండే క్విక్ లింక్స్ ట్యాబ్ లో అడుగున ఉండే ‘లింక్ ఆధార్ స్టేటస్’ ఎంచుకోండి. ఇక్కడ కొత్త పేజీ వస్తుంది మరియు అందులో సూచించిన బాక్స్ లో మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేయండి. తర్వాత కింద రైట్ సైడ్ లో కనిపించే ‘View Link Aadhar Status’ పై క్లిక్ చేయండి.

పైన చెప్పినట్లు చేసినప్పుడు మీ పాన్ ఆధార్ స్టేటస్ లింక్ అయినట్లు వస్తే, మీరు కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆధార్ లింక్ అవ్వకపోతే మాత్రం వెంటనే మీ పాన్ ఆధార్ లింక్ చేయండి.
Also Read: Jio Best Plans: నెలకు రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా పొందండి.!
Aadhaar Pan Card Link ఇలా చేయండి
ఆదాయపు పన్ను శాఖ అఫీషియల్ సైట్ నుండి మీ పాన్ మరియు ఆధార్ ను రెండు నిముషాల్లో లింక్ చేయవచ్చు. అంతేకాదు, ఇది చాలా సులభం మరియు మీరు సొంతగా చేసుకోవచ్చు. దీనికోసం, ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అఫీషియల్ వెబ్‌సైట్ లో “e-Pay Tax” అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి. ఇక్కడ Minor Head: 500 – Other Receipts ఎంచుకోండి. ఇక్కడ వచ్చిన ఆప్షన్ లో ‘Fee for PAN–Aadhaar linking’ ను ఎంచుకోండి. మీ బ్యాంకు లేదా UPI యాప్ ద్వారా రూ. 1,000 ఫీజు చెల్లించండి. ఇది ప్రస్తుతం నడుస్తున్న లేటు ఫీజు. పేమెంట్ చేసిన తర్వాత మీరు Link Aadhaar ట్యాబ్ లోకి వెళ్లి మీ ఆధార్ మరియు పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వ్యాలీ డేట్ చేయండి. అంతే, మీ ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ పూర్తవుతుంది.

ఒకవేళ మీరు ఇంత ప్రోసెసర్ చేయలేము అనుకుంటే, మీ ఫోన్ నుంకో ఒక చిన్న SMS పంపించి కూడా మీ పాన్ ఆధార్ లింక్ చేయవచ్చు. దీనికోసం మీ ఆధార్ తో లింక్ అయిన రిజిష్టర్ మొబైల్ నెంబర్ నుంచి UIDPAN <12-అంకెల Aadhaar నంబర్> <10-అంకెల PAN నంబర్> ఫార్మాట్ లో ఎంటర్ చేసి, ఈ మెసేజ్ ను 567678 లేదా 56161 నెంబర్ కి పంపించండి. ఇలా చేయడం ద్వారా కూడా ఈ పాన్ మరియు ఆధార్ లింక్ అవుతుంది.