Nothing Phone (3a) Pro: ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.!
నథింగ్ ఫోన్ 3a ప్రో ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది
నథింగ్ ఫోన్ 3a ప్రో ఇండియాలో రూ. 29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది
ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Nothing Phone (3a) Pro: నథింగ్ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3a ప్రో ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మొత్తంగా రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ను అందుకునే అవకాశం అందించింది.
SurveyNothing Phone (3a) Pro : ఆఫర్
నథింగ్ ఫోన్ 3a ప్రో ఇండియాలో రూ. 29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 28,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా Axis, HDFC, ICICI మరియు IDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఆప్షన్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12 జీబీ వేరియంట్ ను రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరలో పొందవచ్చు.
Also Read: BSNL New Plan: బడ్జెట్ ధరలో రోజుకు 3GB డేటాతో కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!
Nothing Phone (3a) Pro : ఫీచర్స్
నథింగ్ ఫోన్ 3a ప్రో వెనుక పారదర్శక గ్లాస్ కలిగిన కొత్త డిజైన్ మరియు గ్లిఫ్ లైట్ సెటప్ తో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ Flexible AMOLED స్క్రీన్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో ఈ ఫోన్ పని చేస్తుంది మరియు జతగా 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా జతగా 50MP పెరిస్కోప్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు 60x సూపర్ జూమ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఓ ఉండే IP64 రేటింగ్ తో ఉంటుంది.