Realme NARZO 90x: చాలా కాలంగా నార్జో 90 సిరీస్ గురించి టీజింగ్ చేస్తున్న నార్జో 90 సిరీస్ ను ఈరోజు రియల్ మీ లాంచ్ చేసింది. వీటిలో నార్జో 90x ఫోన్ ను బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సరికొత్త ఆకట్టుకునే డిజైన్ తో మరియు 144Hz రిఫ్రెష్ వంటి గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ తో పాటు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Realme NARZO 90x: ప్రైస్
రియల్ ఈ బడ్జెట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6 జీబీ + 128 జీబీ) రూ. 13,999 ప్రైస్ తో మరియు హై ఎండ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 15,499 ధరతో లాంచ్ చేసింది. డిసెంబర్ 23వ తేదీన ఈ రియల్ మీ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై ఏకంగా రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను నైట్రో బ్లూ మరియు ఫ్లాష్ బ్లూ కలర్ రెండు వేరియంట్స్ లో అందించింది.
ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గేమింగ్ కోసం అనువైన 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఇందులో మీడియాటెక్ బడ్జెట్ గేమింగ్ చిప్ సెట్ గా పిలవబడే Dimensity 6300 చిప్ సెట్ అందించింది. జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ రియల్ మీ ఫోన్ 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఎఐ ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో కూడా 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ బడ్జెట్ లో ఇది బిగ్ బ్యాటరీ కలిగిన ఫోన్స్ లో ఒకటిగా నిలిచింది. రియల్ మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫిషియల్ రికగ్నైజేషన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8.28mm మందం మరియు 212g బరువుతో రియల్ మీ నార్జో 90 ఫోన్ కంటే కొంచెం మందం మరియు బరువుతో ఉంటుంది.