Jio Free Offer: రూ. 35,100 ఉచిత లాభాలు పొందాలంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయండి.!
యూజర్లకు ఉచిత లాభాలు అందించడంలో దాదాపు దశాబ్ద కాలంగా తనదైన ముద్ర వేసిన జియో
ఇప్పుడు కూడా యూజర్ల కోసం ఉచిత లాభాలు అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది
రూ. 35,100 ఉచిత లాభాలు పొందాలంటే మీ జియో నెంబర్ ను ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది
Jio Free Offer: యూజర్లకు ఉచిత లాభాలు అందించడంలో దాదాపు శతాబ్ద కాలంగా తనదైన ముద్ర వేసిన జియో, ఇప్పుడు కూడా యూజర్ల కోసం ఉచిత లాభాలు అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. జియో సిమ్ కార్డు ఉపయోగించే కస్టమర్లు అందరూ ఈ ఉచిత లాభాలు పొందే అవకాశం కూడా అందించింది. లేటెస్ట్ గా జియో అందించిన రూ. 35,100 ఉచిత లాభాలు పొందాలంటే మీ జియో నెంబర్ ను ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. వాస్తవానికి, ఈ ప్లాన్స్ ఇప్పటికే అధికంగా ఉపయోగించబడుతున్న బెస్ట్ ప్లాన్స్ గా కూడా చెప్పబడుతున్నాయి.
SurveyJio Free Offer: ఏమిటి ఆ ఉచిత ఆఫర్?
గూగుల్ మరియు రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఉచిత ఆఫర్ అందించింది. అదేమిటంటే, రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ప్రీమియం యాక్సెస్ ని యూజర్ల కోసం రీఛార్జ్ ప్లాన్స్ తో అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో మీరు రీఛార్జ్ చేస్తే మీకు ఈ ఉచిత ప్రీమియం ఫీచర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
Jio Free Offer: ఏమిటి ఆ ప్లాన్స్?
అన్లిమిటెడ్ 5జి తో అందించి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై రిలయన్స్ జియో ఈ ఉచిత ఆఫర్లు అందించింది. ఇక ప్లాన్స్ విషయానికి వస్తే, ఇందులో రూ. 349 ప్లాన్, రూ. 399 ప్లాన్, రూ. 445, రూ. 449, రూ. 629, రూ. 719, రూ. 749, రూ. 859, రూ. 899, రూ. 949, రూ. 999, రూ. 1,028, రూ. 1,029, రూ. 1,049, రూ. 1,199, రూ. 1,299, రూ. 1,799, రూ. 2,025, రూ. 3,599 మరియు రూ. 3,999 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ఉచిత లాభాలు లభిస్తాయి.

వీటిలో కొన్ని ప్లాన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్ మరియు Zee5 వంటి OTT లాభాలు కూడా ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, ఇక్కడ తెలిపిన అన్ని ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, డైలీ 100 SMS లాభాలతో పాటు జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తాయి.
Also Read: Lava Play Max 5G: బడ్జెట్ ప్రైస్ లో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Google AI Pro తో లాభాలు ఏమిటి?
గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ అందుకుంటే మీకు 2TB వరకు గూగుల్ వన్ స్టోరేజ్ యాక్సెస్ లభిస్తుంది. అంటే, గూగుల్ ఫోటోస్, జిమెయిల్ మరియు డ్రైవ్ వంటి వాటిలో మీరు 2TB వరకు మీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అత్యున్నతమైన రీసర్చ్ ప్రోగ్రాం NotebookLM యాక్సెస్, ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేసే Whisk యాక్సెస్, Ai ఫిల్మ్ మేకింగ్ టూల్ Flow యాక్సెస్ మరియు సూపర్ Ai వీడియోలు క్రియేట్ చేసే Veo 3.1 యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది.