Aadhaar New Rules: ఆధార్ జిరాక్స్ కాపీ తో పనిలేని డిజిటల్ వెరిఫికేషన్ తెస్తోంది..!
Aadhaar New Rules తో ఆధార్ కార్డు పై మరింత సెక్యూరిటీ పెంచే ప్రయత్నం చేస్తోంది
ఇక నుంచి హోటల్ మరియు ఇతర అవసరాలకు ఆధార్ జిరాక్స్ కాపీ అవసరం ఉండదు
ప్రభుత్వ అనుమతి పొందిన ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ సిస్టం సిద్ధం చేసుకోవాలి
Aadhaar New Rules : దేశంలో పెరుగుతున్న మోసాలు మరియు డేటా ప్రైవసీ పై దృష్టిసారించిన ప్రభుత్వం ఆధార్ కార్డు పై మరింత సెక్యూరిటీ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొత్త QR Code ఆధార్ అప్డేట్ అందించిన ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ సబ్ మిషన్ గురించి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి పనికి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు ఆధార్ కార్డు కాపీలను ఆడుతూ ఉంటారు. గత్యంతరం లేక కస్టమర్లు కూడా వారి ఆధార్ కాపీ సబ్ మీట్ చేయాల్సి వస్తుంది. అయితే, ఇకనుంచి అలా కాకుండా ఆధార్ బెస్ట్ వెరిఫికేషన్ మాత్రమే నిర్వహించేలా కొత్త రూల్స్ తీసుకురావడానికి UIDAI యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
SurveyAadhaar New Rules: ఏమిటి ఈ కొత్త రూల్?
హోటల్, ఈవెంట్ ఆర్గనైజర్ లేదా ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగిన సందర్భాలు మొదలుకొని చాలా అవసరాలకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకోవడం దశాబ్ద కాలంగా కొనసాగుతోంది. అయితే, ఇక నుంచి ఇలా చేయడానికి వీలు లేకుండా UIDAI కఠిన నియమాలు తీసుకొస్తోంది. ఈ కొత్త నియమాల ప్రకారం, హోటల్, ఈవెంట్ లేదా మరింకేదైనా అవసరాలకు ఆధార్ కాపీ తీసుకోకూడదు. దీనికి వారు ప్రభుత్వ అనుమతి పొందిన ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ సిస్టం సిద్ధం చేసుకోవాలి. ఇది చాలా సురక్షితంగా మరియు వేగంగా ఉంటుందని కూడా చెబుతున్నారు.
Also Read: Flipkart Buy Buy 2025 Sale నుంచి 15 వేల బడ్జెట్ లోనే 43 ఇంచ్ 4K Smart TV అందుకోండి.!
Aadhaar New Rules: ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఎవరైనా సరే ఇతరుల ఆధార్ వివరాలు కలిగి ఉండటం వారి ప్రైవసీ మరియు సెక్యూరిటీ కి భంగం కలిగించడం అవుతుంది. అందుకే, ఈ కొత్త నియామాలు తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త రూల్స్ తో యూజర్ యొక్క QR Code ఆధార్ తో స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇందులో యూజర్ డేటా నిక్షిప్తం అయ్యి ఉంటుంది కాబట్టి వివరాలు ఆటోమాటిగ్గా వెరిఫై చేస్తుంది. ఈ పద్ధతిలో యూజర్ యొక్క డేటా ఇతరులు చూసే లేదా స్టోర్ చేసే అవకాశం ఉండదు.

అయితే, ఈ కొత్త రూల్ ఇంకా అప్రూవల్ దశలోనే ఉన్నట్లు UIDAI CEO భువనేశ్ కుమార్ తెలిపారు. ఈ కొత్త రూల్స్ అప్రూవ్ అయితే, వెంటనే ఈ కొత్త రూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ఆయన తెలిపారు. ఇందులో ఇది కేవలం ఆన్లైన్ లో మాత్రమే కాకుండా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా వారి సిస్టం తో ఇన్ కార్పొరేట్ చేయడం ద్వారా ఆఫ్ లైన్ లో ఈ వెరిఫికేషన్ చేసుకునేలా ఎంటైటీస్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త రూల్ కనుక వాడుకలోకి వస్తే, ముఖ్యంగా హోటల్ లేదా OYO ద్వారా రూమ్ బుక్ చేసుకునే వారి ఆధార్ వివరాలు చాలా సెక్యూర్ గా మరియు మరింత గోప్యంగా ఉండే అవకాశం ఉంటుంది.