Lava Agni 4 ప్రీమియం ఫీచర్స్ తో చాలా చవక ధరలో లాంచ్ అయ్యింది.!
Lava Agni 4 ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల అయ్యింది
ప్రీమియం ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో కేవలం బడ్జెట్ ధరలో వచ్చింది
ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది
Lava Agni 4 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల అయ్యింది. చాలా రోజులుగా లావా టీజింగ్ చేస్తూ వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు భారత్ మార్కెట్లో అడుగు పెట్టింది. చాలా ప్రీమియం ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో కేవలం బడ్జెట్ ధరలోనే లావా ఈ ఫోన్ విడుదల చేసింది. ఇప్పటికే భారత మార్కెట్లో భారీగా పెరిగిన పోటీకి తగిన ఫీచర్స్ తో అగ్ని 4 స్మార్ట్ ఫోన్ విడుదల చేసినట్టు, ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఏమిటో వివరంగా చూద్దామా.
SurveyLava Agni 4 : స్పెక్స్
లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో అందించింది. ఇది 3.35GHz క్లాక్ స్పీడ్ కలిగిన చిప్ సెట్ మరియు ఇది 4nm ప్రొసెస్ పై నిర్మించడింది. చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చే 8GB LPDDR5x ర్యామ్ మరియు వేగంగా ట్రాన్స్ఫర్ చేసే 256GB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP (OIS) మెయిన్ కెమెరా మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు వెనుక కెమెరాలు కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ కూడా అందించింది.

లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ లో 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో అనేక Ai ఏజంట్స్ తో కూడిన Vayu AI ని లావా ఈ ఫోన్ లో కొత్తగా పరిచయం చేసింది. అంతేకాదు, ఈ ప్రత్యేకమైన ఎఐ కోసం ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కూడా అందించింది. ఇది ట్యూటర్, కాల్ సమరైజేషన్, సిస్టం లెవెల్ AI కంట్రోల్స్ మరియు ఫోటో ఎడిటింగ్ వంటి అనేక పనులు నిర్వహిస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్ తో ఉంటుంది.
Also Read: 120Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ తో కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన Kodak
Lava Agni 4 : ప్రైస్
లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 22,999 ఆఫర్ ధరలో అందుకోవచ్చు. నవంబర్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.