Realme P Series 5G: కొత్త సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం రియల్ మీ టీజింగ్.!
Realme P Series 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఫ్లిప్ కార్ట్ యూనిక్ గా అందిస్తుంది
ఇండియా యొక్క మోస్ట్ వాంటెడ్ ‘X’ ఫోన్ అని టీజింగ్
Realme P Series 5G: రియల్ మీ GT8 సిరీస్ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రియల్ మీ పి సిరీస్ నుండి కొత్త 5జి ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు కూడా ఈరోజు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఇప్పటికే P4 5G మరియు P4 Pro స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో విడుదల చేసింది కాబట్టి, P5 5G, P5 Pro ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు.
SurveyRealme P Series 5G: లాంచ్ డేట్
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మోడల్ పేరు లేదా స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వంటి వివరాలు ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సిరీస్ నుంచి అందించే ఫోన్లు గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ మరియు టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Realme P Series 5G: టీజింగ్
రియల్ మీ అప్ స్మార్ట్ ఫోన్ ఏమిటో చెప్పుకోండి చూద్దాం? అంటూ, రియల్ మీ టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజింగ్ పేజీ నుంచి ఈ ఫోన్ గురించి ఈ ఆటపట్టించే టీజర్ విడుదల చేసింది. ఇందులో సైబర్ పంక్ బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద X కలిగిన ఇమేజ్ అందించింది. ఈ ఇమేజ్ లో కొన్ని హిడెన్ గుర్తులు వదిలి పెట్టినట్టు కనిపిస్తోంది.

ఇక ఈ ఇమేజ్ ని డీకోడ్ చేస్తే, ఇది రియల్ మీ తీసుకురాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గురించి కొన్ని వివరాలు చెబుతుంది. రియల్ మీ అప్ కమింగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్లు గొప్ప గేమింగ్ సపోర్ట్ కలిగిన చిప్ సెట్ తో లాంచ్ కావచ్చని అర్ధం అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఇది గేమింగ్ ఆప్టిమైజ్ చిప్ సెట్ మరియు మరింత గొప్ప AI శక్తి కలిగిన చిప్ సెట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Lava Agni 4 : టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ టీజర్ లో మోస్ట్ వాంటెడ్ X అని ఈ ఫోన్స్ గురించి రియల్ మీ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు ఫోన్ వివరాల గురించి మరిన్ని డిటైల్స్ త్వరలోనే రియల్ మీ అందిస్తుందని ఆశిద్దాం. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.