LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

HIGHLIGHTS

LG Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది

డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది

LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

LG Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. చవక అంటే 5 వేలు లేదా 10 వేలు అని మాత్రం అనుకోకండి, ఈ సౌండ్ బార్ లాంచ్ తో పోలిస్తే ఈరోజు చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 30 వేల ధరలో లాంచ్ అయితే, ఈరోజు అమెజాన్ నుంచి 21 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

ఎల్ జి లేటెస్ట్ 3.1.1 సౌండ్ బార్ S70TY 400W సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 29,990 ధరలో సేల్ అయ్యింది మరియు రీసెంట్ దీపావళి సేల్ నుంచి కూడా రూ. 24,990 రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 22,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ని యస్ బ్యాంక్, IDFC ఫస్ట్, BOB CARD క్రెడిట్ కార్డు ఉపయోగించి EMI ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

LG Dolby Atmos Soundbar Deal

అయితే, Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి రూ. 1,724 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 21,490 రూపాయల ఆఫర్ ధరలోనే లభిస్తుంది. Buy From Here

Also Read: బిగ్ డీల్: కేవలం 21 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

LG Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, ముందు మూడు స్పీకర్లు మరియు పైన సెంటర్ అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం సెటప్ మరియు డిజైన్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ WOW ఆర్కెస్ట్రా సౌండ్ ఫీచర్ మరియు AI సౌండ్ ప్రో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది గొప్ప క్వాలిటీ సౌండ్ అందిస్తుంది మరియు టోటల్ 400W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.. ఈ సౌండ్ బార్ HDMI ఇన్ , HDMI అవుట్, USB మరియు బ్లూటూత్ కనెక్టవిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo