Oppo Find X9 Pro స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి. ఈ ఫోన్ కోసం కంపెనీ అందిస్తున్న టీజింగ్ పేజీ ద్వారా ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ వెల్లడించింది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ ఎంత శక్తివంతమైన ఫీచర్స్ తో మార్కెట్లో అడుగు పెడుతుందో అర్ధం అవుతుంది.
Survey
✅ Thank you for completing the survey!
Oppo Find X9 Pro : టాప్ 5 ఫీచర్స్
డిజైన్
ఈ ఫోన్ చాలా స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ సిల్క్ వైట్ మరియు టైటానియం చార్కోల్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 1.15mm అల్ట్రా థిన్ బెజెల్స్ కలిగిన ఎడ్జ్ టూ ఎడ్జ్ డిజైన్ తో ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది 3nm చిప్ సెట్ మరియు జతగా LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ అల్ట్రా ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
డిస్ప్లే
ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 6.78 ఇంచ్ Pro XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ తో పాటు 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో లేటెస్ట్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది అడాప్టివ్ ఐ కేర్ తో కూడా వస్తుంది.
కెమెరా
ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP ,మెయిన్ కెమెరా, 200MP HASSELBLAD టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు ట్రూ కలర్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు మరియు 120Hz వద్ద 4K డాల్బీ విజన్ వీడియో వంటి గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ 120x AI టెలిస్కోపిక్ ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ భారీ 7500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.