Bose సౌండ్ టెక్నాలజీతో Master Buds Max లాంచ్ చేసిన నోయిస్.!
నోయిస్ సరికొత్త Master Buds Max హెడ్ ఫోన్ లాంచ్ చేసింది
ఈ హెడ్ ఫోన్ ను ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ Bose సౌండ్ టెక్నాలజీ తో లాంచ్ చేసింది
ఈ హెడ్ ఫోన్ లో మరింత లీనమయ్యే సౌండ్ కోసం అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించింది
ఇండియన్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ఆడియో ప్రొడక్ట్స్ అందిస్తున్న బ్రాండ్ గా మంచి పొందిన Noise కొత్త హెడ్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ ను ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ Bose సౌండ్ టెక్నాలజీ తో లాంచ్ చేసింది. అదే, Master Buds Max హెడ్ ఫోన్ మరియు ఈ హెడ్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో కూడా అందించింది.
SurveyNoise Master Buds Max sound by Bose : ప్రైస్
నోయిస్ ఈ హెడ్ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ధరతో లిస్ట్ చేసింది. అయితే, ఈ హెడ్ ఫోన్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ హెడ్ ఫోన్ నోయిస్ అధికారిక సైట్ తో పాటు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులో ఉంచింది. ఈ హెడ్ ఫోన్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ హెడ్ ఫోన్ ఆక్సి, సిల్వర్ మరియు టైటానియం మూడు రంగుల్లో లభిస్తుంది.
Noise Master Buds Max sound by Bose : ఫీచర్స్
ఈ నోయిస్ మాస్టర్ బడ్స్ మాక్స్ హెడ్ ఫోన్ BOSE సౌండ్ టెక్నాలజీ ట్యూన్డ్ ఆడియో సపోర్ట్ కలిగిన 40mm కస్టమ్ డైనమిక్ బిగ్ డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఇందులో అందించిన LHDC 5.0 డైనమిక్ ఈక్వలైజర్ సపోర్ట్ తో సుపీరియర్ క్వాలిటీ సౌండ్ అందిస్తుందని నోయిస్ ఈ కొత్త హెడ్ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.

ఈ హెడ్ ఫోన్ లో మరింత లీనమయ్యే సౌండ్ కోసం అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించింది. ఇది మాత్రమే కాదు ఈ హెడ్ ఫోన్ గొప్ప స్పేషియల్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. కాలింగ్ కోసం ఇందులో 5 మైక్ ENC సపోర్ట్ అందించింది. ఈ హెడ్ ఫోన్ ఫోకస్ మోడ్, ఫైండ్ మై హెడ్ ఫోన్ ANC కంట్రోల్ వంటి అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక ఈ హెడ్ ఫోన్ కలిగిన ఇతర ఫీచర్స్ మరియు బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే, ఇందులో 60 గంటల ప్లే టైమ్ అందించే గొప్ప బ్యాటరీ సపోర్ట్ అందించింది. అంతేకాదు, వేగంగా ఛార్జ్ చేసే ఇంస్టాఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ నోయిస్ హెడ్ ఫోన్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్, వేర్ డిటెక్షన్, డ్యూయల్ పెయిరింగ్ మరియు స్విఫ్ట్ కాల్ మోడ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: iQOO Neo 10R 5G అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!
ఈ హెడ్ ఫోన్ ను ఓవరాల్ ఫీచర్స్ తో పాటు చాలా ప్రీమియం డిజైన్ తో అందించింది. ఇందులో సౌండ్ బై బోస్ లోగో ను కూడా అందించింది.