Lava Bold N1 Lite బిగ్ డీల్స్ మరియు ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!
Lava Bold N1 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా
ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది
బిగ్ డిస్ప్లే మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
Lava Bold N1 Lite స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ చేయగా ఇప్పుడు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో మరింత చవక ధరలో సేల్ అవుతోంది. అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది. లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ పై అమెజాన్ అందించిన డీల్స్ ఏమిటో చూడండి.
SurveyLava Bold N1 Lite: ప్రైస్
లావా బోల్డ్ ఎన్ 1 సిరీస్ నుంచి ఇప్పటికే ఎన్, ఎన్ ప్రో మరియు ఎన్ 5జి మూడు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన లావా ఇప్పుడు బోల్డ్ ఎన్ 1 లైట్ వెర్షన్ ఫోన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 5,699 ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ కార్డ్ తో ముకొనే వారికి రూ. 569 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 5,130 ధరలో అందుకోవచ్చు.
Also Read: BSNL 4G: కేవలం రూ. 200 ఖర్చుతో నెల మొత్తం డేటా మరియు కాలింగ్ అందుకోండి.!
Lava Bold N1 Lite: ఫీచర్స్
లావా ఈ ఫోన్ ను 6.75 ఇంచ్ HD + రిజల్యూషన్ కలిగిన బిగ్ డిస్ప్లే తో లాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఈ ఫోన్ లావా బోల్డ్ ఎన్ 1 సిరీస్ నుంచి ముందుగా వచ్చిన 5g ఫోన్ మాదిరిగా ఉంటుంది. ఈ ఫోన్ గ్లాసీ బ్యాక్ మరియు పెద్ద కెమెరా బంప్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లుక్స్ పరంగా ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఫోన్ Unisoc T765 ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 3 జీబీ ఫిజికల్ ర్యామ్, 5 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 13MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. లావా బోల్డ్ ఎన్ 1 లైట్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది.