Jio Super Plan: కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు.!

HIGHLIGHTS

కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు

బెస్ట్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ఎంతో కొంత ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది

నెల రోజులు మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది

Jio Super Plan: కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు.!

Jio Super Plan: మీ ఇంట్లో అందరూ రిలయన్స్ జియో సిమ్ కార్డ్ యూజ్ చేస్తూ ప్రతి నెల సెపరేట్ రీఛార్జ్ చేస్తూ విసుగెత్తి ఉంటే, మీ కోసం ఒక బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు. అంటే, రీఛార్జ్ ఒక్కటి కానీ లాభాలు మూడు అన్నమాట. ప్రస్తుతం పెరిగిన టారిఫ్ ప్రైస్ తో రీఛార్జ్ కోసం బిల్లు తడి అవుతుంది. ఇటువంటి బెస్ట్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ఎంతో కొంత ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఈ Jio Super Plan ?

ఏమిటి ఈ జియో సూపర్ ప్లాన్ అనుకుంటున్నారా? ఇదే జియో ఆఫర్ చేస్తున్న 449 రూపాయల ఫ్యామిలీ ప్రీపెయిడ్ ప్లాన్. దీనికోసం జియో ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా కేవలం నెలకు రూ. 449 రూపాయలతో మూడు నెంబర్లు యాక్టివేషన్ లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. నార్మల్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ మధ్య ఉన్న పెద్ద తేడా కేవలం డేటా మాత్రమే అవుతుంది. ఈ 5G ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. అయితే, ఇందులో కేవలం లిమిటెడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ బెస్ట్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 449 ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్

జియో రూ. 449 ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ పూర్తిగా నెల రోజుల సైకిల్ తో వస్తుంది. ఈ నెల రోజులు మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 75 GB డేటా అందిస్తుంది. ఈ డేటా ముగిసిన తర్వాత 1GB డేటా కోసం 10 రూపాయలు బిల్ ఛార్జ్ చేస్తుంది. ఈ ప్లాన్ ఎంచుకునే వారు ఇందులో మూడు వరకు SIM యాడ్ చేసుకోవచ్చు. ఈ అదనపు ఫ్యామిలీ మెంబర్స్ కోసం 5 జీబీ అదనపు డేటా కూడా అందిస్తుంది. ఇది కాకుండా రోజుకు 100 SMS చొప్పున నెల రోజులు SMS సర్వీస్ కూడా ఆఫర్ చేస్తుంది.

Jio Super Plan

ఈ ప్లాన్ తో ఎంచుకునే యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే, ఈ ప్లాన్ తో యాడ్ ఆన్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఒకొక్క సిమ్ కు రూ. 150 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ ఎంచుకునే ఎలిజిబుల్ యూజర్లకు అన్లిమిటెడ్ 5G అందిస్తుంది.

Also Read: ఆల్ న్యూ డిజైన్ తో Realme 15 Pro GoT Limited Edition లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో అదనపు లాభాలు కూడా అందిస్తుంది.ఈ ప్లాన్ తో రెండు నెలల JioHome సబ్ స్క్రిప్షన్, 3 నెలల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, Ajio నుంచి రూ. 1,000 రూపాయల షాపింగ్ పై రూ. 200 తగ్గింపు, 1 నెల జియో సావన్ ప్రో సబ్ స్క్రిప్షన్, JioHotstar మూడు నెలల సబ్ స్క్రిప్షన్ మరియు 50GB ఉచిత Jio AI Cloud స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఇవన్నీ కూడా Jio 9th Anniversary Celebration లో భాగంగా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo