Xiaomi 17 Pro Max: నాలుగు 50MP కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ Elite 8 Gen 5 తో లాంచ్.!
Xiaomi 17 Pro Max స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది
నాలుగు 50MP కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ Elite 8 Gen 5 వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ లో సరికొత్త డ్యూయల్ స్క్రీన్ డిజైన్ తో కూడా అందించింది
Xiaomi 17 Pro Max: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ మూడు కొత్త స్మార్ట్ ఫోన్ లను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లు షియోమీ 17 సిరీస్ నుండి విడుదల చేసింది. వీటిలో హైఎండ్ ఫోన్ షియోమీ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను నాలుగు 50MP కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ Elite 8 Gen 5 వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో సరికొత్త డ్యూయల్ స్క్రీన్ డిజైన్ తో కూడా అందించింది.
SurveyXiaomi 17 Pro Max: ఫీచర్స్ (చైనా)
షియోమీ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను వెనుక చిన్న స్క్రీన్ కలిగిన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో ముందు డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 3.0 సపోర్ట్ కలిగిన 6.9 ఇంచ్ బిగ్ 2K LTPO OLED స్క్రీన్ ఉంటుంది మరియు వెనుక 2.9 ఇంచ్ సెకండరీ AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. 40 లక్షల AnTuTu స్కోర్ తో క్వాల్కమ్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ తో 12GB / 16GB ర్యామ్ మరియు 512GB లేదా 1TB స్టోరేజ్ ఆప్షన్ తో వేరియంట్స్ ను చైనాలో లాంచ్ చేసింది.

ఈ షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP పెరిస్కోప్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిపి మొత్తం నాలుగు 50MP కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టన్నింగ్ ఫోటోలు మరియు సూపర్ స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS బెస్ట్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో ఉంటుంది.
షియోమీ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ భారీ 7,500mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన సెకండరి స్క్రీన్ నోటిఫికేషన్, బ్యాక్ కెమెరా సెల్ఫీ, Ai పెట్స్ సెట్ చేసుకోవడానికి మరియు మరిన్ని స్మార్ట్ పనులు చేస్తుంది.
Also Read: Sony Pulse Elevate: లైఫ్ లైక్ సౌండ్ మరియు బిల్ట్ ఇన్ మైక్ తో కొత్త స్పీకర్స్ అనౌన్స్ చేసిన సోనీ.!
Xiaomi 17 Pro Max: ప్రైస్ (చైనా)
ఈ ఫోన్ ను చైనాలో మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. మూడు వేరియంట్ ధర వివరాలు క్రింద చూడవచ్చు.
షియోమీ 17 ప్రో మాక్స్ (12GB + 512GB) ప్రైస్ : CNY 5,999 (సుమారు రూ. 75,000)
షియోమీ 17 ప్రో మాక్స్ (16GB + 512GB) ప్రైస్ : CNY 6,299 (సుమారు రూ. 78,000)
షియోమీ 17 ప్రో మాక్స్ (16GB + 1TB) ప్రైస్ : CNY 6,999 (సుమారు రూ. 87,000)
ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి షియోమీ ప్రస్తుతానికి ఎటువంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.