2025 పండుగ సేల్స్ నుంచి జబర్దస్త్ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఎంత గొప్ప ఆఫర్స్ లభిస్తున్నాయి అంటే, భారీ డిస్కౌంట్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv లు కూడా లభిస్తున్నాయి. ఇది నిజంగా నిజమండి బాబోయ్, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటి ఈ 65 ఇంచ్ QLED Smart Tv డీల్?
Infinix ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 65GU2Q ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి 38% డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 36,999 ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 35,249 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన GST 2.0 దెబ్బకు స్మార్ట్ టీవీ ధరలు ఇంతగా తగ్గడానికి కావడానికి కారణమయింది.
ఈ ఇన్ఫినిక్స్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, Zee5, SonyLIV మరియు MX Player వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ 65 ఇంచ్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 48W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI, బ్లూటూత్, AV ఇన్, ఈథర్నెట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా పెద్దగా ఉన్నా కూడా మంచి స్లీక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.