Samsung Galaxy A35 5G ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Samsung Galaxy A35 5G ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో అమ్ముడవుతోంది

ఈ ఫోన్ కేవలం 17 వేల రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది

Samsung Galaxy A35 5G ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది.!

ఎవ్వరూ ఊహించని విధంగా Samsung Galaxy A35 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది. మంచి ఫీచర్స్ తో గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టిన ఈ ఫోన్ మంచి అమ్మకాలు కూడా సాధించింది. అయితే, శాంసంగ్ యొక్క ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలోనే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అమ్ముడవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ డీల్ వివరాలు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy A35 5G : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎ 35 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 30,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Axis Bank Flipkart డెబిట్ / క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Samsung Galaxy A35 5G Flipkart sale offers

ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం 17 వేల రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ గత సంవత్సరం 25 వేల నుంచి 20 వేల బడ్జెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్స్ లో ఒకటిగా నిలిచింది. కానీ, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం 17 వేల రూపాయల ఆఫర్ ధరలోనే లభిస్తుంది.

Also Read: ఇండియాలో కొత్త Comet AI బ్రౌజర్ లాంచ్ చేసిన perplexity ai

Samsung Galaxy A35 5G : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎ 35 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ Super AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది Exynos 1380 చిప్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP + 8MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS వద్ద UHD 4K వీడియో రికార్డింగ్, 10x జూమ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సర్కిల్ టు ఫైండ్ వంటి AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 5000mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో చాలా పటిష్టమైన డిజైన్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo