Flipkart BBD Sale బిగ్ డిస్కౌంట్ తో POCO X7 Pro చవక ధరలో లభిస్తోంది.!
Flipkart BBD Sale ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు మొదలయ్యింది
ఈరోజు పోకో మిడ్ రేంజ్ పవర్ ఫుల్ ఫోన్ POCO X7 Pro ను భారీ డిస్కౌంట్ తో చవక ధరలో ఆఫర్ చేస్తోంది
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అండర్ 20 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది
Flipkart BBD Sale ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు మొదలయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు పోకో మిడ్ రేంజ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ POCO X7 Pro ను భారీ డిస్కౌంట్ తో చవక ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో అండర్ 30 వేల బడ్జెట్ ధరలో వచ్చిన బెస్ట్ ఫోన్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అండర్ 20 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveyFlipkart BBD Sale POCO X7 Pro : డీల్
పోకో ఎక్స్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో Rs. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి రూ. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 20,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ ను HDFC లేదా సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ తో పాటు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో పోకో ఎక్స్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 18,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
Also Read: Amazon GIF Sale: ప్రైమ్ మెంబెర్స్ కోసం భారీ Samsung Smart Tv ఆఫర్ ప్రకటించింది.!
POCO X7 Pro : ఫీచర్స్
పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ సరికొత్త డ్యూయల్ టోన్ డిజైన్ లో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity D8400 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 1.7Mn+ AnTuTu స్కోర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, Dolby Vision సపోర్ట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP Sony మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ చేస్తుంది మరియు మంచి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6550 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.