మీరు కూడా మీ Gemini AI Nano Banana Saree స్టైల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో.!

HIGHLIGHTS

మీ సెల్ఫీలు లేదా ఫోటోలు Gemini AI Nano Banana Saree ఇమేజ్ గా మార్చుకోవచ్చు

మీ ఫోన్ లో కలిగిన గూగుల్ జెమినీ ఎఐ సపోర్ట్ తో ఈ కొత్త స్టైల్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు

ఈ సినిమాటిక్ ఫోటో శారీ ఫోటో క్రియేట్ చేయడానికి తగిన ప్రాంప్ట్ ఉంటే సరిపోతుంది

మీరు కూడా మీ Gemini AI Nano Banana Saree స్టైల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో.!

మీ సెల్ఫీలు లేదా ఫోటోలు Gemini AI Nano Banana Saree ఇమేజ్ గా మార్చుకోవచ్చు. మీ ఫోన్ లో కలిగిన గూగుల్ జెమినీ ఎఐ సపోర్ట్ తో ఈ కొత్త స్టైల్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సినిమాటిక్ ఫోటో శారీ ఫోటో క్రియేట్ చేయడానికి తగిన ప్రాంప్ట్ ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఈ కొత్త 4K సినిమాటిక్ శారీ ఫోటో క్రియేట్ చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. జస్ట్ మేము అందించిన ప్రాంప్ట్ తో మీరు మీ ఫోటోలు చాలా ఈజీగా ఈ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ తో మీ ఫోటో కూడా మోడల్ లేదా సినిమా హీరోయిన్ లాంటి స్టైల్ ఫోటో గా మార్చుకోండి. దీనికి అవసరమైన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gemini AI Nano Banana Saree ఎలా క్రియేట్ చేయాలి?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో కలిగిన జెమినీ ఎఐ ద్వారా ఈ కొత్త రకం సూపర్ ఇమేజ్ లను క్రియేట్ చేయవచ్చు. మీ ఫోన్ లో ఒకవేళ బిల్ట్ ఇన్ జెమినీ ఎఐ లేకుంటే Gemini AI యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ముందుగా జెమినీ ఎఐ యాప్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ కోసం ఉపయోగించే (+) ప్లస్ గుర్తును ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీ కెమెరా యాప్ ఓపెన్ అవుతుంది మరియు ఇందులో కొత్త సెల్ఫీ, ఫోటో లేదా ఆల్రెడీ ఫోటో గ్యాలరీ లో ఉన్న ఏదైనా ఒక ఫోటో ఎంచుకోండి. మీరు ఎంచుకున్న ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత ప్రాంప్ట్ ను ఫోటో క్రింద కాపీ పేస్ట్ చేయండి. ఈ వివరాలు అందించిన వెంటనే మీరు కోరుకున్న కొత్త నానో బనానా శారీ స్టైల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోటో ను ఇమేజ్ డ్రెస్ మరియు స్కిన్ కలర్ వంటి వివరాలు కూడా మీరు మార్చుకోవచ్చు.

స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో

జెమినీ ఎఐ ఓపెన్ చేయండి
ప్లస్ (+) గుర్తు పై నొక్కండి
మీరు కోరుకునే ఫోటో సెలెక్ట్ చేయండి
జెమిని ఏఐ లో ఈ ఫోటో జత చేయబడుతుంది
మీరు ఇచ్చిన ఫోటో క్రింద మేము అందించిన ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేయండి
ఇంకేముంది గూగుల్ ఏఐ కొత్త ఇమేజ్ మీకు అందిస్తుంది

Also Read: GIF Sale కంటే ముందే లేటెస్ట్ 100 ఇంచ్ Lumio Projector పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ఇమేజ్ కోసం ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఏమిటి?

“Hyper-realistic 4K portrait of a young Indian woman, identical face to reference, long dark wavy hair with white flowers behind right ear, wearing a sheer elegant blue saree with fitted blouse, soft serene expression gazing slightly right. Warm-toned plain wall background with cinematic warm side lighting, casting smooth-edged shadow of her profile and flowing hair. Retro, artistic, timeless mood.”

Gemini AI Nano Banana Saree Image

మీరు క్రియేట్ చేసిన ఈ ఇమేజ్ లో స్కిన్ టోన్ లేదా బట్టలు లేదా బ్యాగ్రౌండ్ లేదా ఇంకా ఏవైనా వివరాలు మార్చాలనుకుంటే, తగిన ప్రాంప్ట్ ఇచ్చి మార్చుకోవచ్చు. అంటే, చీర రంగు కోసం “Change the Saree color to Blue” అలాగే డ్రెస్ మార్చాలనుకుంటే “Change the saree color and design” లాంటి కొత్త ప్రాంప్ట్ లను ఇవ్వడం ద్వారా కొత్త మెరుగులు దిద్దవచ్చు. మీరు కూడా ఇలాంటి సినిమా హీరోయిన్ లేదా మోడల్ లాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo