Flipkart BBD Sale బిగ్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసింది అనడం కంటే లిస్ట్ చేసింది అనడం ఇంకా సమంజసం గా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ చేయబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ. 51,999 ధరకే లిస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మరి ఈ ఆఫర్ ఏమిటో మరియు ఆ ట్విస్ట్ ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart BBD Sale Apple iPhone 16 డీల్ ఏమిటి?
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా సేల్ కంటే ముందే చాలా డీల్స్ రివీల్ చేసింది. ముందుస్తుగా అందించిన ఈ డీల్స్ లో ఆపిల్ ఐఫోన్ 16 పై అందించిన డీల్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఐఫోన్ సైట్ నుంచి ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 69,999 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అవ్వగా, ఫ్లిప్ కార్ట్ మాత్రం ఈరోజు ఈ ఫోన్ ను కేవలం రూ. 51,999 డిస్కౌంట్ ధరతో లిస్ట్ చేసింది.
ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ప్రైస్ తో లిస్ట్ ఐతే అయ్యింది. కానీ, ఈ ఫోన్ కొనడానికి చూస్తే మాత్రం ప్రస్తుతం ఈ ఫోన్ అందుబాటులో లేదు అని చెబుతోంది. అంటే, ఈ డీల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందుబాటులోకి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఈ ఫోన్ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో చూడాలి. అయితే, ఐఫోన్ 16బ్లాక్ కలర్ వేరియంట్ ని మాత్రమే సేల్ లో లిస్ట్ చేసింది. మిగతా కలర్స్ ని కమింగ్ సూన్ తో లిస్ట్ చేసింది. కానీ ప్రైస్ మాత్రం అదే రూ. 51,999 రూపాయల ధరను లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ఈ ప్రైస్ లో లభిస్తే మాత్రం ఈ సేల్ నుంచి భారీ అమ్మకాలను సాధించే అవకాశం ఉంటుంది.