Samsung Galaxy Buds 3 FE: గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ అయ్యింది.!
శాంసంగ్ లేటెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
Samsung Galaxy Buds 3 FE ప్రీమియం డిజైన్ తో వస్తుంది
ఈ ఇయర్ బడ్స్ ను గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ చేసింది
Samsung Galaxy Buds 3 FE : శాంసంగ్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం సెగ్మెంట్ ఇయర్ బడ్స్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
SurveySamsung Galaxy Buds 3 FE: ప్రైస్
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE ఇయర్ బడ్స్ ని రూ. 12,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ వచ్చే వారం నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లతో పాటు జతగా కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 వరకు ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ పై రూ. 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ మరియు అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
Also Read: OPPO F27 Pro+: 11 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల ధరలో లభిస్తోంది.!
Samsung Galaxy Buds 3 FE: ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE గొప్ప సౌండ్ అందించే పెద్ద స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది కస్టమ్ ఈక్వలైజర్ మరియు 360 డిగ్రీల ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ ఇయర్ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ తో సూపర్ సైలెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంటే, బయట నుంచి వచ్చే ధ్వనులను తగ్గించి మంచి లీనమయ్యే సౌండ్ మరియు కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ లో చాలా సులభమైన జెశ్చర్ కంట్రోల్ ను కూడా అందించింది.

ఇది క్విక్ పెయిర్ మరియు ఆటో స్విచ్ ఫీచర్స్ తో మంచి కనెక్టివిటీ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE ఈజీ పెయిరింగ్, శాంసంగ్ ఫైండ్, జెమినీ వాయిస్ వేకప్ మరియు యాంబియంట్ సౌండ్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE బడ్స్ టోటల్ 30 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది మరియు IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.