OPPO F27 Pro+: 11 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల ధరలో లభిస్తోంది.!
OPPO F27 Pro+ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈరోజు లభిస్తుంది
రూ. 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది
ఈ ఫోన్ 6.7 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది
OPPO F27 Pro+ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈరోజు లభిస్తుంది. ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ వచ్చిన ఈ F27 సిరీస్ ప్రీమియం ఫోన్ ఇప్పుడు రూ. 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డీల్ వివరాలు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOPPO F27 Pro+: ఆఫర్ ఏమిటి?
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ (8GB + 128GB) ఇండియాలో రూ. 27,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బెస్ట్ ప్రైస్ కు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ పై రూ. 9,850 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 18,149 రూపాయల అతి తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది.

పైన తెలిపిన భారీ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC Bank క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,899 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ ఫోన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: GIF Sale 2025 కంటే ముందే భారీ 5.2 Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
OPPO F27 Pro+ : ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం లెథర్ బ్యాక్ తో వస్తుంది. చూడగానే ఆకట్టుకునే గొప్ప డిజైన్ తో ఈ ఫోన్ ను ఒప్పో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD + రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ తో చాలా పటిష్టంగా ఉంటుంది.
ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 64MP మెయిన్ కెమెరాకి జతగా 2MP సెకండరీ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, స్లో మోషన్, డ్యూయల్ వీడియో మరియు మంచి ఫోటో ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 67W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.