Moto Buds Bass: ఈరోజు నుంచి మొదలైన మోటో Dolby Atmos సూపర్ బడ్జెట్ బడ్స్ సేల్.!

HIGHLIGHTS

మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది

Moto Buds Bass Dolby Atmos మరియు LDAC వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో మోటోరోలా లాంచ్ చేసింది

ఈ కొత్త ఇయర్ బడ్స్ బ్లూ, గ్రీన్ మరియు గ్రే మూడు రంగుల్లో లభిస్తుంది

Moto Buds Bass: ఈరోజు నుంచి మొదలైన మోటో Dolby Atmos సూపర్ బడ్జెట్ బడ్స్ సేల్.!

Moto Buds Bass: మోటోరోలా గతవారం సరికొత్తగా విడుదల చేసిన మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం 2 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో Dolby Atmos మరియు LDAC వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో మోటోరోలా లాంచ్ చేసింది. ఈ బడ్స్ కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Buds Bass: ప్రైస్

మోటరోలా ఈ కొత్త మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ను కేవలం 1999 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్ ను ఫ్లిప్ కార్ట్ మరియు మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ బ్లూ, గ్రీన్ మరియు గ్రే మూడు రంగుల్లో లభిస్తుంది.

Moto Buds Bass: ఫీచర్స్

మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ హెవీ బాస్ సౌండ్ అందించే 12.4mm స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ LADC మరియు Hi-Res Wireless సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు స్పేషియల్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేసే సత్తా కలిగి ఉంటుంది.

Moto Buds Bass

ఈ మోటోరోలా కొత్త ఇయర్ బడ్స్ 50 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది వెలుపలి రణగొణ ధ్వనులు నియంత్రిస్తుంది మరియు మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ ట్రాన్స్పరెన్సీ, అడాప్టివ్ మరియు ANC ఆన్ మోడ్స్ తో వస్తుంది. ఈ మోటో బడ్స్ 6 Mic లను కలిగి ఉంటుంది మరియు మంచి కాలింగ్ కూడా అందిస్తుంది.

Also Read: Apple event 2025: ఐఫోన్ 17 సిరీస్ మరియు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం సిద్ధమైన యాపిల్.!

ఇక మోటో బడ్స్ బాస్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ IPX4 రేటింగ్ వాటర్ రెపెళ్లేంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ టైప్ C ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ సింగిల్ ఛార్జ్ తో 7 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo