Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే భారీ 50 ఇంచ్ QLED Smart Tv అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే
సేల్ కంటే ముందే భారీ 50 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ ఒకటి ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది
ఈ డీల్ కేవలం ఈ రోజు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది
Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సేల్ కంటే ముందే భారీ 50 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ ఒకటి ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది మరియు ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అంటే, ఈ డీల్ కేవలం ఈ రోజు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అందుకే, ఈ బిగ్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.
Survey50 ఇంచ్ QLED Smart Tv డీల్ ఏమిటి?
Kodak ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో విడుదల చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 50MT5011 ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ ఈరోజు 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, PNB క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,200 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు డీల్స్ తో ఈ టీవీ కేవలం రూ. 23,799 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే క్యూలెడ్ స్మార్ట్ టీవీ లతో పోలిస్తే ఇది పెద్ద స్క్రీన్ కలిగిన టీవీ అవుతుంది మరియు మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Amazon Great Indian Festival సేల్ భారీ ఆఫర్స్ తో వచ్చేసింది.!
కొడాక్ 50 ఇంచ్ QLED Smart Tv ఫీచర్స్ ఏమిటి?
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో అంచులు లేని విధంగా ఉంటుంది. ఇందులో HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, AV ఇన్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఇక ఈ స్మార్ట్ టీవీ కలిగిన సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ మరియు డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Netflix, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కూడా కూడా ఉంటుంది.