Moto Buds BASS బడ్స్ ని Dolby Atmos తో చవక ధరలో లాంచ్ చేసిన మోటోరోలా.!

HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు Moto Buds BASS కొత్త ఇయర్ బడ్స్ ఇండియాలో విడుదల చేసింది

ఈ కొత్త బడ్స్ ని డాల్బీ అట్మాస్ మరియు Hi-Res LADC తో లాంచ్ చేసింది

ఈ బడ్స్ 50dB డైనమిక్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది

Moto Buds BASS బడ్స్ ని Dolby Atmos తో చవక ధరలో లాంచ్ చేసిన మోటోరోలా.!

మోటోరోలా ఈరోజు Moto Buds BASS కొత్త ఇయర్ బడ్స్ ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ని డాల్బీ అట్మాస్ మరియు Hi-Res LADC తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను అట్రాక్టివ్ న్యూ కలర్స్ లో అందించడమే కాకుండా మంచి బడ్జెట్ ధరలో కూడా లాంచ్ చేసింది. మోటోరోలా లేటెస్ట్ గా అందించిన ఈ కొత్త ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Buds BASS : ప్రైస్

మోటోరోలా ఈ కొత్త బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 1,999 రూపాయల ధరతో అందించింది. ఈ బడ్స్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ పాంటోన్ పోషి గ్రీన్, పాంటోన్ డార్క్ షాడో మరియు పాంటోన్ బ్లూ జ్యూవెల్ వంటి మూడు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ లేటెస్ట్ బడ్స్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: vivo T4 Pro 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్దమైన వివో కొత్త ఫోన్.!

Moto Buds BASS : ఫీచర్స్

మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ను కంఫర్ట్ ఫిట్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ ను 12.4 mm డైనమిక్ డ్రైవర్స్ (స్పీకర్) తో అందించింది. ఈ బడ్స్ Dolby Atmos తో గొప్ప సరౌండ్ మరియు Hi-Res LADC ఫీచర్ తో గొప్ప క్లారిటీ కలిగిన హై రెజల్యూషన్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ బడ్స్ 50dB డైనమిక్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ అధిక బాస్ సౌండ్ కోసం ప్రత్యేకంగా అందించబడిన బడ్స్ మరియు మోటో బడ్స్ తో పోలిస్తే అధిక బాస్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది.

Moto Buds BASS

ఈ మోటోరోలా ఇయర్ బడ్స్ 6 మిక్స్ కలిగి మంచి కాలింగ్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా మంచి కాలింగ్ కోసం ఇందులో Crystal Talk AI మరియు ENC ఫీచర్ అందించింది. ఇది చాలా క్లియర్ మరియు స్టన్నింగ్ క్వాలిటీ కాలింగ్ అందించడానికి సహాయం చేస్తుంది. ఈ మోటో కొత్త బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అంతేకాదు, 10 నిముషాల ఛార్జ్ తో 2 గంటల ప్లే టైమ్ అందించే క్విక్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ moto buds app సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo