Google DATA Leak: 250 కోట్ల జీమెయిల్ యూజర్ల డేటా లీక్ తో కొత్త స్కామ్ లకు తెరలేచే అవకాశం.!
ప్రపంచంలో అతిపెద్ద డేట్ లీక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది
చరిత్రలో జరిగిన అతిపెద్ద డేట్ లీక్స్ లో ఇది కూడా ఒకటి
Google DATA Leak కారణంగా కొత్త స్కామ్ లకు తెరలేచే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు
Google DATA Leak: ప్రపంచంలో అతిపెద్ద డేట్ లీక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెక్ దిగ్గజం గూగుల్ యొక్క 250 కోట్ల మంది జీమెయిల్ యూజర్ల డేట్ లీకైనట్లు నివేదికలు తెలిపాయి. ఇప్పటి వరకు వచ్చిన డేటా లీక్ లిస్ట్ లో ఇది కూడా మెయిన్ లిస్ట్ లో చేరుతుంది. చరిత్రలో జరిగిన అతిపెద్ద డేట్ లీక్స్ లో ఇది కూడా ఒకటి. ఈ కొత్త డేటా లీక్ కారణంగా కొత్త స్కామ్ లకు తెరలేచే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Surveyఏమిటి ఈ Google DATA Leak?
గూగుల్ ఉద్యోగిని మభ్యపెటిన స్కామర్లు మాల్వేర్ ద్వారా Salesforce ప్లాట్ఫాం యొక్క యాక్సెస్ అందుకున్నారు. ఈ యాక్సెస్ తో ఈ డేటా బేస్ లోని డేటాని అందుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ డేటా లీక్ లో పాస్వర్డ్ లేదా బ్యాంక్ సమాచారం లీక్ కాలేదని తెలుస్తోంది. కానీ, కాంటాక్ట్ డీటైల్స్, బిజినెస్ వివరాలు మరియు ఇతర వివరాలు కలిగిన డేటా లీక్ అయినట్లు తెలిపారు.
ఈ డేటా లీక్ తో దాదాపు 250 కోట్ల మంది Gamil యూజర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. అందుకే, ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద డేటా లీక్స్ లో ఒకటి అని చెబుతున్నారు.
ఈ డేటా లీక్ తో వచ్చే ముప్పేంటి?
ఈ అతిపెద్ద గూగుల్ డేటా లీక్ ద్వారా యూజర్లకు కొత్త స్కామ్ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫిషింగ్ ఈమెయిల్స్, ఫిషింగ్ కాల్స్ మరియు SMS స్కామ్స్ వంటి వాటికి ఆస్కారం ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, డేటా లీక్ లో ప్రధానమైంది కాంటాక్ట్స్ లీక్ కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉంటుంది.

అంటే, యూజర్ల ఈమెయిల్ మరియు కాంటాక్ట్ వివరాలు స్కామర్ల చేతికి చేరాయి కాబట్టి వాటి ద్వారా ఈమెయిల్స్ మరియు SMS పంపించే అవకాశం ఉంటుంది. ఇదే కాదు యూజర్లను OTP లు మరియు పాస్వర్డ్ లకు సైతం రిక్వెస్ట్ అడిగే ప్రమాదం ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
Also Read: BOSE సౌండ్ తో Moto Buds Loop కొత్త రకం బడ్స్ లాంచ్ చేసిన మోటోరోలా.!
అకౌంట్ ఎలా సురక్షితం చేసుకోవచ్చు?
ప్రస్తుతం విపత్తు నుంచి తప్పించుకోవడానికి యూజర్లు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీ జిమెయిల్ సెక్యూరిటీ పెంచండి మరియు బలమైన కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. 2FA (టూ – ఫ్యాక్టర్ అథెంటికేషన్) లేదా పాస్ కి ఉపయోగించండి. ముఖ్యంగా, అనుమానిత మెసేజ్ లను నమ్మొద్దు. మీ ఫోన్ లో అందుకునే OTP లు లేదా మీ పాస్వర్డ్ లను ఇతరులతో పంచుకోకండి. మీ గూగుల్ అకౌంట్ సెక్యూరిటీ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా లోపాలు లేదా బలహీనతలు ఉన్నట్లు అనిపిస్తే సరిచేసుకోండి. మరింత సెక్యూరిటీ కోసం Scam Check టూల్స్ ఉపయోగించడం మంచిది.