సూపర్ సౌండ్ మరియు బిగ్ స్క్రీన్ తో వచ్చిన బ్లౌపంక్ట్ కొత్త Mini LED Smart Tv ఫస్ట్ సేల్.!
Blaupunkt ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది
సూపర్ సౌండ్ మరియు బిగ్ స్క్రీన్ తో ఈ కొత్త Mini LED Smart Tv లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు సేల్ కోసం అందుబాటులోకి వస్తోంది
ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ Blaupunkt ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. సూపర్ సౌండ్ మరియు బిగ్ స్క్రీన్ తో ఈ కొత్త Mini LED Smart Tv లను ఇండియాలో లాంచ్ చేసింది. బ్లౌపంక్ట్ QD Mini LED సిరీస్ నుంచి ఈ కొత్త టీవీలు లాంచ్ చేసింది. ఇందులో 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ రెండు టీవీలు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు సేల్ కోసం అందుబాటులోకి వస్తోంది.
Surveyబ్లౌపంక్ట్ Mini LED Smart Tv : ఫీచర్స్
బ్లౌపంక్ట్ విడుదల చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు Mini QD 4K డిస్ప్లే కలిగి ఉంటాయి. ఇందులో ఒకటి 65 ఇంచ్ పరిమాణం కలిగిన స్క్రీన్ మరియు రెండోది 75 ఇంచ్ పరిమాణం కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ రెండు కొత్త టీవీలు కూడా డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 540 లోకల్ డిమ్మింగ్ జోన్స్ తో చాలా గొప్ప విజువల్స్ అందించే శక్తిని కలిగి ఉంటుంది. ఈ టీవీ VRR అండ్ ALLM మరియు MEMC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ బెజెల్ తో చాలా ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే, ఈ టీవీలో 6 స్పీకర్లు మరియు రెండు ఉఫర్స్ కలిగిన స్పీకర్ సెటప్ అందించింది. ఈ స్పీకర్ సెటప్ తో ఈ టీవీలు టోటల్ 108W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ టీవీ Dolby Atmos సర్టిఫికేషన్ తో సినిమా థియేటర్ వంటి సూపర్ సౌండ్ అందిస్తుంది. ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూ టూత్ 5.0, USB, ఈథర్నెట్, AV in, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ మరియు ఎయిర్ ప్లే వంటి చాలా కనెక్టివిటీ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: New Scam: కార్డు లేదా OTP తో కూడా పని లేకుండా అకౌంట్ ఖాళీ చేస్తున్న స్కామర్లు.!
బ్లౌపంక్ట్ Mini LED Smart Tv : ప్రైస్
ఈ బ్లౌపంక్ట్ కొత్త స్మార్ట్ టీవీలు ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
బ్లౌపంక్ట్ 65 ఇంచ్ మినీ LED స్మార్ట్ టీవీ ధర : రూ. 94,999
బ్లౌపంక్ట్ 75 ఇంచ్ మినీ LED స్మార్ట్ టీవీ ధర : రూ. 1,49,999
ఆఫర్స్ :
ఈ స్మార్ట్ టీవీ లపై 12 నెలల నో కాస్ట్ EMI మరియు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.