Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ Sony 3X పెరిస్కోప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను Sony 3X పెరిస్కోప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ వివో టి సిరీస్ లో వచ్చిన హై ఎండ్ ఫోన్ గా నిలుస్తుంది
Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Sony 3X పెరిస్కోప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వివో టి సిరీస్ లో వచ్చిన హై ఎండ్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తో ఈ సిరీస్ లో బడ్జెట్ నుంచి హై ఎండ్ ఫోన్ వరకు కంప్లీట్ పోర్టుఫోలియో అందించినట్లు అవుతుంది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyVivo T4 Pro ధర ఏమిటి?
ఈ వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 8 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ రూ. 27,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 29,999ప్రైస్ ట్యాగ్ తో వివో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై భారీ సింగల్ డే లాంచ్ డీల్స్ కూడా అందించింది. ఈ ఫోన్ బ్లేజ్ గోల్డ్ మరియు నైట్రో బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.

Vivo T4 Pro ఆఫర్స్ ఏమిటి?
వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 3,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 24,999 ప్రారంభ ధరలో అందుకోవచ్చు. అయితే, పైన తెలిపిన రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక్క ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ HDFC, SBI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో రూ. 4,950 కే లభిస్తున్న 180W Dolby Soundbar డీల్ గురించి మీకు తెలుసా.!
వివో టి4 ప్రో ఫీచర్స్ ఏమిటి?
వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం 7.53mm మందంతో చాలా సన్నగా మరియు 192 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 10,00,000 AnTuTu స్కోర్ అందించే క్వాల్కమ్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 4 తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప Sony కెమెరా సెటప్ కూడా అందించింది. ఇందులో వెనుక 50MP 3x (Sony IMX 882) పెరిస్కోప్ కెమెరా, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా మరియు 2MP బొకే సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. అలాగే, ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది.
కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 30 FPS తో స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వివో కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.