Lava Play Ultra 5G బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Lava Play Ultra 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లావా విడుదల చేసింది
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేయడం విశేషం
ఈ ఫోన్ పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది
Lava Play Ultra 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లావా విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేయడం విశేషం. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందించిన లావా ఇప్పుడు గేమింగ్ ప్రత్యేకమైన ఫోన్ కూడా ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. మరి లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
SurveyLava Play Ultra 5G: ప్రైస్
లావా ప్లే అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను కేవలం రూ. 14,999 రూపాయల ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) వేరియంట్ ను కూడా కేవలం రూ. 16,499 రూపాయల ధరలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అన్ని ప్రధాన బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఈ లాంచ్ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ స్లేట్ మరియు ఆర్కిటిక్ ఫ్రాస్ట్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది.
Also Read: Vivo T4 Pro ఇండియా డేట్ అనౌన్స్ చేసిన వివో.!
Lava Play Ultra 5G: ఫీచర్స్
లావా ప్లే అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్స్ కలిగిన స్టన్నింగ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ బిగ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు మరియు 16.7M కలర్ డెప్త్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ గేమింగ్ బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ Dimensity 7300 తో లాంచ్ చేసింది. ఇది 7 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ లేటెస్ట్ లావా స్మార్ట్ ఫోన్ వెనుక 64MP SONY IMX682 మెయిన్ కెమెరా జతగా 5 కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో 13MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన లావా కెమెరా ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.