అండర్ రూ. 15,000 ధరలో లభించే బెస్ట్ 40 ఇంచ్ FHD QLED Smart Tv లు ఇవే.!
బెస్ట్ 40 ఇంచ్ FHD QLED Smart Tv ల గురించి చూసే వారికి తగిన టీవీలు
బడ్జెట్ ధరలో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ తీసుకోవాలి అని చూసే వారికి బెస్ట్ ఆప్షన్
చవక ధరలో ఇంటికి తగిన కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు పరిశీలించవచ్చు
అండర్ రూ. 15,000 ధరలో లభించే బెస్ట్ 40 ఇంచ్ FHD QLED Smart Tv ల గురించి ఈరోజు ఇక్కడ వివరాలు అందిస్తున్నాను. బడ్జెట్ ధరలో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ తీసుకోవాలి అని చూసే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. చవక ధరలో ఇంటికి తగిన కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు కూడా ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ వివరాలు పరిశీలించవచ్చు.
Surveyఏమిటా 40 ఇంచ్ FHD QLED Smart Tv లు?
భారత మార్కెట్లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరలో చాలా స్మార్ట్ టీవీలు లభిస్తుంది. అయితే, ప్రైస్ తో పాటు యూజర్ కి తగిన ఫీచర్లు కలిగి ఉన్న స్మార్ట్ టీవీ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాము. అలాంటి రెండు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఈరోజు అందిస్తున్నాము. ఇందులో ఒకటి Thomson Alpha 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కాగా రెండవది Infinix Y-Series 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ. ఈ రెండు టీవీ వివరాలు ఇప్పుడు చూద్దాం.

థాంసన్ ఆల్ఫా (40) FHD QLED Smart Tv
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన 40 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు డైనమిక్ క్రిస్టల్ కలర్స్ తో పాటు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు Linux OS పై నడుస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 36W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్, AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. అయితే, ఈ టీవీ Netflix OTT కి సపోర్ట్ చేయదు. కానీ, ఈ టీవీ ప్రస్తుతం కేవలం రూ. 13,499 ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. బ్యాంకు ఆఫర్స్ తో 12 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది.
Also Read: Jio Best Plans: తక్కువ ఖర్చుతో OTT తో సహా అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
ఇన్ఫినిక్స్ వై సిరీస్ (40) స్మార్ట్ టీవీ
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ పరిమాణం మరియు FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఇది మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు గొప్ప బ్రైట్నెస్ తో మంచి రంగులు కూడా అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 512MB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 16W సౌండ్ అవుట్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi, AV ఇన్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా Linux OS పై నడుస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 14,999 ధరలో లభిస్తుంది మరియు బ్యాంక్ ఆఫర్స్ తో 13 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.