OPPO K13 Turbo 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త పవర్ ఫుల్ ఫోన్ సేల్.!
OPPO K13 Turbo 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది
ఇన్ బిల్ట్ ఫ్యాన్ సపోర్ట్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు భారీ ఆఫర్స్ తో సేల్ అవుతోంది
ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరలో లభిస్తుంది
OPPO K13 Turbo 5G: ఒప్పో ఇండియాలో కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ సిరీస్ కె 13 టర్బో సిరీస్ 5జి యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 13 టర్బో 5జి ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఇన్ బిల్ట్ ఫ్యాన్ సపోర్ట్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు భారీ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరలో లభిస్తుంది.
SurveyOPPO K13 Turbo 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్
ఒప్పో కె 13 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో అండర్ 30 వేల బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 27,999 ధరతో మరియు ఈ ఫోన్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 29,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై అందించిన లాంచ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ అండర్ 25 వేల బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది.
ఆఫర్స్ ఏమిటి?
ఈ ఫోన్ పై రూ. 3,000 డిస్కౌంట్ అందుకునేలా రెండు ఆఫర్లు ఒప్పో అందించింది. ఈ ఫోన్ బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ లేదా ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ ను ఒప్పో అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను ఇప్పుడు మీరు ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అఫీషియల్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
OPPO K13 Turbo 5G: ఫీచర్స్
ఒప్పో కె 13 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫోన్ తో వచ్చిన మొదటి ఫోన్. అంతేకాదు, ఈ బడ్జెట్ ప్రైస్ లో ఈ ఫీచర్ కలిగిన ఏకైక ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి ఈ ఫీచర్ అందించింది మరియు దీనికి జతగా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా అందించింది. ఈ ఫోన్ IPX9, IPX8 మరియు IPX6 సపోర్ట్ తో టాప్ టైర్ వాటర్ ప్రూఫ్ ఫోన్ గా కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఆల్ రౌండ్ ఆర్మర్ బాడి తో మంచి [పటిష్టమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8450 ఆక్టా కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది 11 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది మరియు ఇందులో ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
Also Read: Honor X7c 5G: ప్రీమియం లుక్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ ఒప్పో కొత్త ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్, 4K (60fps) వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI Unblur, AI రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి అనేకమైన AI కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 700 mAh భారీ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు O రియాలిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.